యూఏఈని కమ్మేసిన పొగమంచు..రెడ్ అలర్ట్ జారీ..!!

- January 03, 2026 , by Maagulf
యూఏఈని కమ్మేసిన పొగమంచు..రెడ్ అలర్ట్ జారీ..!!

యూఏఈ: పొగమంచు యూఏఈని కమ్మేసింది. అదే సమయంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.  ఈ మేరకు పొగమంచుకు సంబంధించి ఎల్లో మరియు రెడ్ హెచ్చరికలను జారీ చేసింది.  తేలికపాటి నుండి మధ్యస్థ వేగంతో గాలులు వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో దుమ్ము తుఫాన్ లు వచ్చే అవకాశం ఉందన్నారు.   

ఇదిలా ఉండగా, అబుదాబిలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా 15°C మరియు గరిష్టంగా 24°Cగా ఉంటాయని తెలిపారు. దుబాయ్‌లో శనివారం ఉష్ణోగ్రతలు 13°C నుండి 24°C మధ్య ఉంటాయని ఎన్‌సిఎం తన తాజా బులెటిన్‌లో వెల్లడించింది.

ఎన్‌సిఎం ప్రకారం, శుక్రవారం ఉదయం దేశవ్యాప్తంగా నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత రాక్నా (అల్ ఐన్)లో ఉదయం 5:45 గంటలకు 3.7°C మరియు అత్యధిక ఉష్ణోగ్రత కల్బా (షార్జా)లో మధ్యాహ్నం 1:15 గంటలకు 26.5°Cగా నమోదైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com