విజయ్‌ ఆంటోని రాధిక నిర్మాణంలో సినిమా..

- January 04, 2017 , by Maagulf
విజయ్‌ ఆంటోని రాధిక నిర్మాణంలో సినిమా..

 'సలీం', 'నాన్‌' చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్‌ ఆంటోని గత ఏడాది 'పిచ్చైక్కారన్‌'లో అందర్నీ సెంటిమెంట్‌తో కట్టిపడేశారు. తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది. త్వరలోనే ఆయన 'ఎమన్‌'గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా తర్వాత ఐ పిక్చర్స్‌ బ్యానరుపై రాధిక నిర్మాతగా ఓ సినిమాలో నటించనున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనుంది. చిత్ర విశేషాల గురించి విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ నేను సంగీత దర్శకుడిగా కెరీర్‌ను ఆరంభించినప్పుడు రాధిక నాకు పలు అవకాశాలు ఇచ్చారు.

సంగీత దర్శకుడిగా నాకు గుర్తింపు రావడానికి ఆమే కారణం. ఇప్పుడు ఆమె బ్యానరులో నటిస్తుండటం.. సొంత బ్యానరులో నటిస్తున్నట్లు ఉంది. ఫిబ్రవరి నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది.

ఎప్పటిలాగే ఈ సినిమా శీర్షిక కూడా తప్పకుండా భిన్నంగా ఉంటుందని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com