ఇ-కస్టమ్స్‌ పేమెంట్‌ సిస్టమ్‌ ప్రారంభం...

- January 04, 2017 , by Maagulf
ఇ-కస్టమ్స్‌ పేమెంట్‌ సిస్టమ్‌ ప్రారంభం...

కస్టమ్స్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ అహ్మద్‌ బిన్‌ హమాద్‌ అల్‌ ఖలీఫా, ఫవాతీర్‌ పేరుతో కస్టమ్స్‌ ఛార్జీల చెల్లింపు కోసం ఇ-పేమెంట్‌ సిస్టమ్స్‌ని ప్రారంభించినట్లు వెల్లడించారు. కస్టమ్స్‌ఎఫైర్స్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఈ వివరాల్ని వెల్లడించారు. కస్టమ్స్‌ విభాగంలో నూతన ఆవిష్కరణల్లో భాగంగా దీన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారాయన. కస్టమ్స్‌ క్లియరెన్స్‌కి సంబంధించిన ఫీజుల చెల్లింపు (ఏజెంట్లు, ట్రాన్స్‌పోర్టీస్‌ మరియు కంపెనీలకు) ఇకపై సులభతరం కాఉంది. స్మార్ట్‌ ఫోన్‌ అప్లికేషన్ల ద్వారా ఈ చెల్లింపులు చేయవచ్చు. బెనిఫిట్‌ కంపెనీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కస్టమ్స్‌ ఎఫైర్స్‌ వర్క్‌ టీమ్‌ని ఈ సిస్టమ్‌ డెవలప్‌మెంట్‌లో భాగం పంచుకున్నందుకుగాను అభినందించారాయన. అలాగే కస్టమ్స్‌ క్లియరెన్స్‌ ఏజెంట్లు సహకారమందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com