అట్లాస్‌ హాస్పిటల్స్‌ అమ్మకానికి..

- January 04, 2017 , by Maagulf
అట్లాస్‌ హాస్పిటల్స్‌ అమ్మకానికి..

మస్కట్‌లోని రెండు ల్యాండ్‌ మార్క్‌ హాస్పిటల్స్‌ అమ్మకానికి వచ్చాయి. 1000కి పైగా పేషెంట్లకు సేవలందించే రెండు హాస్పిటల్స్‌ని అమ్మకానికి ఉంచినట్లు అట్లాస్‌ ఇంటర్నేషనల్‌ ఫర్‌ కమర్షియల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రకటించింది. గుబ్రాలోని అట్లాస్‌ హాస్పిటల్‌ అండ్‌ ఫార్మసీ, అలాగే రువిలోని హెల్త్‌కేర్‌ డివిజన్‌ని అమ్మకానికి ఉంచినట్లు పేర్కొంది. ఈ రెండు ఆసుపత్రుల్లోనూ నిత్యం వెయ్యి మందికి వైద్య సేవలు అందుతున్నాయి. రెండూ 100 పడకల ఆసుపత్రులే. ఆసుపత్రి సిబ్బంది కొత్త యాజమాన్యంతోనూ సఖ్యతగా పనిచేస్తారని అట్లాస్‌ సంస్థ ప్రతినిథులు తెలిపారు. రానున్న రెండు వారాల్లో ఈ హాస్పిటల్స్‌ని కొత్త యాజమాన్యాలకు అందజేయనున్నట్లు అట్లాస్‌ సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో పేషెంట్లకు ఎలాంటి సమస్యలూ రాకుండా తగు చర్యలు తీసుకుంది అట్లాస్‌ సంస్థ. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com