'ఐఎస్' వ్యతిరేక నిరసనలు అఫ్ఘాన్‌లో....
- January 04, 2017
కాబుల్ : అఫ్ఘనిస్తాన్‌లో ఐఎస్ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. వేలాది మంది వీధుల్లోకి చేరుకుని నిరసన గళమెత్తారు. ఐఎస్ దాడుల్లో మృతి చెందిన షీత్ ముస్లింల ఫొటోలు, ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. ఉగ్రవాదం నశించాలంటూ ఐఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాబుల్ నుంచి హెరాత్ నగరంలోని గవర్నర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తీశారు.స్థానిక మీడియా సంస్థ పజ్వక్ తెలిపిన వివరాల ప్రకారం...2వేల మంది నిరసనకారులు ర్యాలీలో పాల్గొన్నారు. షీత్ ముస్లింల మత పెద్దలు ఈ ర్యాలీలో మాట్లాడారు. విద్యాలయాలు, మసీదులపై ఐఎస్ అరాచకాలకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. ఐఎస్ దాడులను తిప్పిగొట్టేందుకు అఫ్ఘాన్ బలగాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నాయని హెరాత్ గవర్నర్ మొహ్మద్ ఆసిఫ్ రహీమీ తెలిపారు.
ఇటీవలి కాలంలో నాన్గర్హార్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల ప్రాబల్యం బాగా పెరిగిపోయిందన్నారు. ఆ ప్రాంతంలో అఫ్ఘాన్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయని చెప్పారు. పౌరుల భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెడతామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆదివారం ఐఎస్ దాడుల్లో ఓ మసీదు ఇమామ్ మృతి చెందారు.
ఇమామ్ మృతి పట్ల గవర్నర్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అఫ్ఘాన్‌లో అల్లర్లు సృష్టించేందుకు ఐఎస్ కుట్ర పన్నిందని అంతర్గత వ్యవహారాల మంత్రి నజీబుల్లా మనీ తెలిపారు. అఫ్ఘనిస్తాన్‌లో మొత్తం 34 ప్రావిన్స్‌లు ఉండగా, 11 ప్రావిన్స్‌ల్లో ఐఎస్ పాగా వేసిందన్నారు. హెరాత్ నగరంలో జరిగిన దాడులన్నింటిలోనూ ఐఎస్ హస్తముందని అనుమానిస్తున్నామని చెప్పారు.
ఇదిలా ఉండగా, గతేడాది అక్టోబర్‌లో మజారే షరీఫ్ మసీదులోకి ఓ సాయుధుడు చొరబడి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 14 మంది షీత్ ముస్లింలు మృతి చెందారు. జులైలో జరిగిన మరో దాడిలో 80 మంది మృతి చెందారు. 130 మంది తీవ్రంగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







