219 మంది భారత జాలర్లను.. విడుదల చేసిన పాక్ ప్రభుత్వం

- January 05, 2017 , by Maagulf
219 మంది భారత జాలర్లను.. విడుదల చేసిన పాక్ ప్రభుత్వం

భారత్‌కు చెందిన సుమారు 219 మంది జాలర్లను పాకిస్థాన్ గురువారం విడుదల చేసింది. ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు పెంపొందించుకునే దిశగా వీరిని రిలీజ్ చేసినట్లు వెల్లడించింది. వాఘా సరిహద్దు వద్ద భారత అధికారులకు ఈ మత్స్యకారులను అప్పగించనుంది. వీరిలో చాలా మంది ఏడాదిపైగా పాకిస్థాన్ జైల్లో గడిపారు.

పాకిస్థాన్ ఇటీవల కొందరు జాలర్లను విడుదల చేసింది. అయితే మరో వంద మంది వరకు అక్కడి జైల్లో మగ్గుతున్నారు. భారత హై కమిషన్ వీరి జాతీయతను గుర్తించాల్సి ఉంది. అంతర్జాతీయ జలాల్లోకి పొరపాటున చొరబడే మత్స్యకారులను భారత్, పాక్ అరెస్ట్ చేస్తుంటాయి. అనంతరం గుడ్‌విల్ గెస్ట్చర్ కింద విడుదల చేస్తుంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com