బాలీవుడ్‌ నటుడు ఓంపురి కన్నుమూత....

- January 06, 2017 , by Maagulf
బాలీవుడ్‌ నటుడు ఓంపురి కన్నుమూత....

ముంబయి: బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు ఓంపురి(66) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో సృగృహంలోనే ప్రాణాలు విడిచారు. బాలీవుడ్‌తో పాటు పలు హాలీవుడ్‌, పాకిస్థాన్‌ చిత్రాల్లో ఆయన నటించారు. తెలుగులో 'అంకురం' చిత్రంలో నటించారు. అద్భుత నటనతో పలుసార్లు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు. ఓంపురి మరణంతో బాలీవుడ్‌ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.
ఓంపురి హరియాణాలోని అంబాలా ప్రాంతంలో పంజాబీ కుటుంబంలో అక్టోబర్‌ 18, 1950లో జన్మించారు. పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఇండియాలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.
1976లో మరాఠీ చిత్రం 'ఘాశీరామ్‌ కొత్వాల్‌'తో సినీరంగ ప్రవేశం చేశారు. 1982లో 'ఆరోహణ్‌', 1984లో 'అర్ధ్‌ సత్య' చిత్రాలకు గానుఆయన జాతీయ ఉత్తమనటుడు అవార్డులు అందుకున్నారు. 1990లో భారత ప్రభుత్వం నుంచి 'పద్మశ్రీ' పురస్కారం పొందారు. ఎనిమిది సార్లు ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్నారు.
ప్రముఖుల సంతాపం 
ఓంపురి మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. నాటకాలు, సినిమాల్లో ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. సోషల్‌మీడియా ద్వారా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.ఇది షాకింగ్‌ న్యూస్‌ అని, ఓ గొప్ప, తెలివైన నటుడిని సినీ రంగం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు... అనుపమ్‌ఖేర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, ఖుష్బూ, రితేష్‌ దేశ్‌ముఖ్‌ తదితరులు ట్విట్టర్‌ ద్వారా సంతాపం తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com