క్రూర జంతువులను ఇళ్లలో పెంచుకోవడం యుఏఇ లో నిషేధం
- January 07, 2017
కుక్క పిల్లలు...పిల్లి పిల్లలను ఇళ్లలో పెంచుకోవడం ఓ ముచ్చట...కానీ , నర మాంసం పర పర మని నమిలేసే క్రూర జంతువులను పెంచుకోవడం..ఆ మృగాలను అపుడపుడు ఊళ్లోకి తీసుకెళ్లి జనాలను హడలగొట్టడం రాక్షత్వం.దీనిని దృష్టిలో ఉంచుకొనేమో అడవి జంతువులను ప్రైవేట్ యాజమాన్యం తమ వద్ద ఉంచుకోవడాన్ని యుఎఇ నిషేధించిందని నివేదికలు బుధవారం తెలిపాయి. అంతరించిపోతున్న చిరుతలు పెద్ద పులులను కొందరు పెంపుడు జంతువుల మాదిరిగా నగరం బయటకు విహారానికి తీసుకెళ్లి యు ఏ ఇ, మరియు పొరుగు గల్ఫ్ దేశాల్లో ఇటీవల రివాజుగా మారింది. గత ఏడాది అక్టోబర్ నెలలో, దుబాయ్ లోని ప్రముఖ హోటల్ బుర్జ్ అల్ అరబ్ సమీపంలో ఒక బీచ్ లో ఐదు పులులతో ఏ భయం లేకుండా ఆటలాడుతున్న వీడియో అలాగే వాహనంలో సింహాలను చుట్టూ ఉంచుకొని డ్రైవింగ్ చేస్తున్నట్లు చిత్రీకరించబడిన మరో వీడియో సామాజిక మీడియాలో విపరీతంగా ప్రచారం కాబడింది. కొత్త చట్టంలో అడవి మృగాలు మరియు మచ్చిక కానీ ప్రమాదకరమైన క్రూర జంతువులన్ని రకాలను, ఆ మృగాలు తమవేనని భావించే యాజమాన్యం పై నిషేధాలు కొనసాగుతాయని ఆంగ్ల దినపత్రికలు నివేదించాయి. అలాంటి క్రూర జంతువులు జంతుప్రదర్శనశాలలు, వన్యప్రాణుల ఉద్యానవనాలు, సర్కస్, బ్రీడింగ్ మరియు పరిశోధన కేంద్రాలు వద్ద ఉంచాలని ఆ పత్రికలు పేర్కొన్నాయి, ప్రజలలోనికి బడాయిగా ఒక చిరుత లేదా సింహం పెద్ద పులి వంటి అసాధారణ జంతువు ఏ రకమైనదైనా తీసుకువెళితే, వారికి ఆరు నెలల జైలు శిక్ష, 500,000 డి హెచ్ ( 136,000 డాలర్లు ) వరకు జరిమానా ఇకపై విధించనున్నారు. అడవి జంతువులు ఉపయోగించి ప్రజలను "భయభ్రాంతులకు" గురిచేసే వాళ్ళకు 700,000 డి హెచ్ జరిమానా, జైలుశిక్ష విధించబడుతుందని తెలిపారు, చట్టం కూడా సంప్రదాయ పెంపుడు జంతువులు మీద నూతన నియంత్రణలను విధించింది. కుక్కలను పెంచుకోవడానికి యజమానులకు తగిన అనుమతులు ఉండాలని ,వాటిని బహిరంగంగా తీసుకువచ్చేటప్పుడు జంతువులను అదుపు చేసే గొలుసులు ఉండాల్సిన అవసరం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి లైసెన్సుల పొందడంలో విఫలం అయ్యినవారికి 100,000 డి హెచ్ వరకు జరిమానా ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







