ప్రవాసి యోగక్షేమ

- January 08, 2017 , by Maagulf

కేంద్ర కార్మిక సంఘాలలో ఒకటైన 'ట్రేడ్ యూనియన్ కో ఆర్డినేషన్ సెంటర్' (టియుసిసి) జాతీయ అధ్యక్షులు, తెలంగాణ కు చెందిన పి.నారాయణ స్వామి నాయకత్వంలో ఐదుగురు సభ్యుల బృందం బెంగళూరు లో 7 నుండి 9 జనవరి వరకు జరుగుతున్న ప్రవాసి భారతీయ దివస్-2017 ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎన్నారైలు, ప్రవాసి కార్మికుల సంక్షేమానికి భారత ప్రభుత్వం తీసుకోవలసిన చర్యల గురించి విజ్ఞప్తి చేశారు

 
* వలస కార్మికుల కోసం సమగ్ర సామాజిక భద్రత (జీవిత బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్, వాపస్ వచ్చినాక పునరావాసం)

* ఎమిగ్రేషన్ చట్టం-1983 ను సమీక్షించి, దాన్ని మరింత బలోపేతం చేయడానికి సమగ్రమైన ఎమిగ్రేషన్ మేనేజ్మెంట్ చట్టం చేయాలి 

* విదేశాలలోని భారత రాయబార కార్యాలయాల సామర్థ్యాలని బలోపేతం చేసి విస్తరించాలి.  విదేశాలలోని భారత వలసదారులను నమోదు చేయడం, హక్కుల పరిరక్షణకు, సమస్యల పరిష్కారానికి భారత రాయబార కార్యాలయాలు కృషి చేయాలి

* విదేశాలకు వెళ్లేముందు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తగిన శిక్షణ పొందడాన్ని తప్పనిసరి చేస్తూ చట్టబద్దం చేయాలి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి, వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడానికి సదస్సులు నిర్వహించాలి

* విమానాశ్రయాల్లో రాకపోకలు సాగించే టర్మినల్స్ లో సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలి 

* ఉద్యోగాల నియామక ప్రక్రియలో అనుసరించే ప్రామాణిక విధానాలు పాటించి వలస కార్మికుల రిక్రూటింగ్ వ్యవస్థను అజమాయిషీ చేయాలి 

* రాష్ట్రాలలో ప్రవాస భారతీయుల కొరకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, పరిపాలన శాఖలను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు భారత ప్రభుత్వం సలహా ఆదేశం ఇవ్వాలి

* సమర్థవంతమైన పాలన కొరకు మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం కొరకు కమిటీలను ఏర్పాటు చేయాలి

* వలస కార్మికుల హక్కుల రక్షణ కొరకు ద్వైపాక్షిక ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలు సమర్థవంతంగా అమలు చేయుటకు భారత ప్రభుత్వం విదేశీ ప్రభుత్వాలతో తగిన ఏర్పాట్లు చేయాలి 

* ప్రవాస భారతీయులకు ఆన్ లైన్ ఓటింగ్ సౌకర్యం కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలి 

* వలసలు మరియు అభివృద్ధి అనే విషయంపై సార్క్, కొలంబో ప్రాసెస్, అబుదాబి డైలాగ్, జిఎఫ్ఎండి లాంటి అంతర్జాతీయ వేదికలపై వేదికలపై భారత ప్రభుత్వం చురుకుగా పాలుపంచుకోవాలి

* వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల పరిరక్షణ గురించి ఐక్యరాజ్య సమితిలో 26 ఏళ్ల క్రితం 1990 లో చేసిన తీర్మానాన్ని భారత ప్రభుత్వం ఆమోదించాలి. ఇంటి పనివారలకు గౌరవప్రదమైన పని అనే నినాదంతో ఐక్యరాజ్య సమితిలో చేసిన సి-189 తీర్మానాన్ని కూడా భారత ప్రభుత్వం ఆమోదించాలి.


--మంద భీం రెడ్డి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com