'టిప్పు సుల్తాన్' గా సూపర్ స్టార్ రజని

- September 11, 2015 , by Maagulf
'టిప్పు సుల్తాన్' గా సూపర్ స్టార్ రజని

సూపర్ స్టార్ రజినీ కాంత్ మరో చారిత్రాత్మక చిత్రంలో నటించనున్నారా..? వెండి తెరపై సుల్తాన్ గా మెరవనున్నారా అంటే అవుననే వినిపిస్తోంది. మైసూర్‌ టైగర్‌గా యావత్‌ ప్రపంచంలో తనకంటూ ఓ చరిత్ర సృష్టించుకున్న భారతీయ రారాజు టిప్పు సుల్తాన్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందే భారీ బడ్జెట్‌ చిత్రంలో రజనీకాంత్‌ నటిస్తున్నట్టు సమాచారం. బెంగుళూరుకి చెందిన ప్రముఖ కన్నడ నిర్మాత అశోక్‌ కీనే ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఓ కన్నడ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత అశోక్‌కీన్‌ ఈ విషయాన్ని తెలియజేశారు. ''టిప్పు సుల్తాన్‌, హాలీవుడ్‌లో రూపొందిన మరో బయోపిక్‌ 'గాంధీ' చిత్రాలను చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. అయితే 'టిప్పుసుల్తాన్‌' చిత్రంలో రజనీకాంత్‌ నటించేందుకు సుముఖంగా ఉన్నారు. భారతీయ భాషల్లో రూపొందిన చిత్రాలతో పోలిస్తే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్‌ విషయమై ఇప్పటికే రజనీకాంత్‌తో పలుమార్లు కలవడం జరిగింది. అలాగే జాతిపిత గాంధీజీ జీవితం ఆధారంగా హాలీవుడ్‌లోనిర్మితమైన చిత్రాన్ని ఓ ప్రముఖ నటుడితో భారతీయ భాషలన్నింటిలోనూ రీమేక్‌ చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నాను'' అని నిర్మాత అశోక్‌కెన్నీ చెప్పారు. అయితే ఈ వార్త రావడంతో టిప్పు సుల్తాన్ గెటప్ లో డిజైన్ చేసిన రజినీ ఫొటోలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసి హల్ చల్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com