ఇక విమానాల్లో వైఫై
- January 11, 2017
విమానాల్లో కూడా ప్రయాణికులకు వై-ఫై సర్వీసులు అందించేందుకు విమానయానసంస్థలు పోటీపడుతున్నాయి. తాజాగా అలస్కా విమానయాన సంస్థ, తన ప్రయాణికులు ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్నప్పుడే ఉచితంగా ఇన్ స్టాంట్ మెసేజింగ్ యాప్ లు వాడుకునేలా అవకాశం కల్పించేందుకు సిద్ధమైంది. ఉత్తర అమెరికాలో దేశీయ విమానాలు నడుపుతున్న అలస్కా ఎయిర్ లైన్స్, విదేశీ మార్గాలోనూ తన సేవలందిస్తోంది. మెక్సికో, కోస్టా రికా, క్యూబా వంటి ప్రాంతాలకు తన విమానాలను నడుపుతోంది. ఎంపికచేసిన ఇన్ స్టాంట్ మెసేజింగ్ సర్వీసులకు ఆన్ బోర్డులో యాక్సస్ అందించడం ప్రస్తుతం బీటా టెస్టింగ్ లో ఉందని అలస్కా పేర్కొంది. ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించాల్సినవసరం లేకుండా 35వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ప్రయాణికులు ఫేస్ బుక్ మెసేంజర్, వాట్సాప్, ఐ మెసేజ్ లను వాడుకోవచ్చని తెలిపింది.
జనవరి 24 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ''గోగో-వైఫై'' అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత కొన్ని సాధారణ స్టెపులను ఫాలో అయి కుటుంబసభ్యులతో, స్నేహితులతో ఇన్ స్టాంట్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్స్ ద్వారా సంభాషణ ప్రారంభించుకోవచ్చని అలస్కా చెప్పింది. ప్రస్తుతం ఇంటర్నెట్ యాక్సస్ ను విమానాల్లో అందించడం ఎయిర్ లైన్ ఇండస్ట్రికి ప్రధాన సవాళ్లుగా నిలుస్తోంది. ఎయిర్ ఫ్రాన్సస్ తాజాగా బోయింగ్ 787 విమానంలో వైఫై సేవలందించింది. కానీ వాటికి చార్జీలు వసూలు చేసింది. ప్రస్తుతం ఎలాంటి చార్జీలు లేకుండా అలస్కా ఎయిర్ లైన్ ఉచిత సేవలందించేందుకు సిద్దమవుతోంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







