కువైట్ లో తెలుగు తమ్ముళ్లచే 'రక్తదాన' కార్యక్రమం
- January 12, 2017
తెలుగుజాతికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ఎన్‌టి రామారావు జీవితం తరతరాల తెలుగు జాతికి ఆదర్శంగా నిలిచిపోతుంది.నటనలో, రాజకీయరంగాల్లో చరిత్ర సృష్టించిన ఎన్‌టి రామారావు వ్యక్తిత్వం, ఔన్నత్వం గురించి విభిన్న కోణాల్లో దిగ్విణీక్రుతం అవుతుంది. పౌరాణిక, చారిత్రక సినిమాలు ఏవైనా ఆయనతో పోటీపడి చేసేవారు నేడు లేరు. రాజకీయాల్లో కూడా అతి తక్కువ కాలంలో పెనుమార్పులు తీసుకువచ్చారు, అలాగే సామాజానికి ఎవరు మంచి పనిచేస్తే వారు ఎప్పటికీ గుర్తుండిపోతారనే విషయం ఎన్‌టి రామారావు విషయంలో నిరూపితమైంది. అలాంటి మహనీయుడి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేపట్టడానికి ఎన్టిఆర్ ట్రస్ట్ ద్వారా ఈరోజున ఎంతో మంది నిరుపేదలకు విద్య, వైద్య, బ్లడ్‌బ్యాంకు, ఉపాధి, తాగునీరు, సహాయ పునరావాస కార్యక్రమాల్లో సేవలందిస్తున్నారు.
ఈ సేవలలో భాగంగా అత్యవసర పరిస్థితిలో రక్తం అందక వేలాది మరణాలు సంభవిస్తున్నట్లు ఎన్టిఆర్ ట్రస్టు నిర్వాహకులు, సిఎం చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి గుర్తిస్తున్న నేపధ్యంలో ఎన్.టి.ఆర్కు నివాళిగా రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని జనవరి 18వ తేది ఎన్టిఆర్ వర్దంతి పురస్కరించుకుని పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వ్హహించాలని పిలుపు ఇచ్చారు.
అయితే కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాక విదేశాలలో కూడా ఎన్.టి.ఆర్ ట్రస్ట్ ఈ సేవాకార్యక్రమాలను విసృతం చేసింది.
కువైట్ లో ప్రవాసాంధ్ర తెలుగు దేశం కువైట్ పార్టి డా.స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి జనవరి 18, సందర్భంగా, జనవరి 14, 2017 న జాబ్రియా బ్లడ్ బ్యాంకు సాయంత్రం 3 గంటలనుండి సాయంత్రం 5.30 నిముషముల వరకు రక్తదాన శిబిరం నిర్వహిస్తోంది.
ప్రవాసాంధ్ర తెలుగు దేశం పార్టీ కువైట్, హైదరాబాద్ ఎన్.టి.ఆర్ ట్రస్ట్ సహకారంతో ప్రతి సంవత్సరం డా.స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతులకి, జయంతులకి బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇండియన్ డాక్టర్స్ ఫోరం ప్రెసిడెంట్ డా.పట్వారి కువైట్ ఏమినేంట్ డాక్టర్ వీరు ప్రతి సంవత్సరం హెల్త్ గైడ్ కువైట్ హెల్త్ మినిస్టర్ ద్వారా విడుదల చేయిస్తూ అటు కువిటీలకి ఇటు ఇండియాన్స్ కి సమన్వయకర్తగా ఉంటూ మంచి ఆర్గనైజర్ గా గుర్తింపు పొందారు. ప్రవాసాంధ్ర తెలుగు దేశం కువైట్ తాము నిర్వహిస్తున్న ఈ రక్తదాన శిబిరానికి డాక్టర్ పట్వారి ని ముఖ్య అతిధిగా ఆహ్వానిస్తున్నారు. డాక్టర్ పట్వారి ముఖ్య అతిధి గా విచ్సుయడమే కాకుండా వారు కూడా రక్త దానం చేస్తున్నారని వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్ కోడూరి తెలిపారు.
కార్యక్రమానికి గౌరవనీయ అతిధి గా ఇండియన్ ఎంబసీ శ్రీ సునీల్ జైన్ హాజరు అవుతున్నారు.
ఈ సందర్భంగా కువైట్ లోని వారందరికీ ప్రవాసాంద్ర తెలుగు దేశం కువైట్ ప్రెసిడెంట్ శ్రీ ఎం. సుబ్బారాయుడు,వర్కింగ్ ప్రెసిడెంట్ వెంట కోడూరి మరియు కమిటి సభ్యులు రక్త దాన శిబిరానికి విచ్చేసి ఎన్.టి.ఆర్ కు నివాళిగా రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఆహ్వానం పలుకుతున్నారు.
ప్రవాసాంధ్ర తెలుగు దేశం పార్టి కువైట్ నిర్వహిస్తున్న ఈ రక్తదాన శిబిరానికి అశేషంగా ప్రజలు విచ్చేసి రక్తదానం చేసి స్వర్గీయ ఎన్.టి.ఆర్ కి నివాళులు అర్పించాలని ఆశిస్తూ డా.స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతికి ప్రవాసాంధ్ర తెలుగు దేశం పార్టి కువైట్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ మరియూ కమిటీ సభ్యులకి అభినందనలు.
తాజా వార్తలు
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఖతార్ లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి..!!
- అరబ్ దేశాలలో రైస్ వినియోగంలో అట్టడుగు స్థానంలో బహ్రెయిన్..!!
- 2025లో కువైట్ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు..!!
- సౌదీ అరేబియాలో నమోదైన అత్యల్ప వింటర్ ఉష్ణోగ్రతలు..!!
- షార్జాలో గుండెపోటుతో 17 ఏళ్ల ఇండియన్ విద్యార్థిని మృతి..!!
- ఒమన్‌లో విధ్వంసం, ఆస్తి నష్టం కేసులో కార్మికులు అరెస్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!







