బిహార్ రాజధానిలో పడవ బోల్తా: 18 మంది మృతి
- January 14, 2017
బిహార్ రాజధాని పాట్నాలో శనివారం ఘోర ప్రమాదం సంభవించింది. గంగానదిలో 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో 18 మంది మృతిచెందగా మిగతా ప్రయాణికులు గాయపడ్డారు. కైట్ ఫెస్టివల్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రెవెన్యూ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. పడవలో పరిమితికి మిచ్చి ప్రయాణికులు ఎక్కడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. బిహార్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







