పంజాబ్ మాజీ సీఎం కన్నుమూత
- January 14, 2017
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి సూర్జిత్‌సింగ్ బర్నాలా శనివారం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఛండీగఢ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 91 ఏళ్లు. బర్నాలా అక్టోబర్ 21, 1925లో హరియాణాలోని అటేలీలో జన్మించారు. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నారు.
1952లో జరిగిన ఎన్నికల్లో పోటీచేసినప్పటికీ ఓటమిపాలయ్యారు. అనంతరం 1977లో పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖామంత్రిగా కూడా సేవలందించారు. అనంతరం 1985 నుంచి 1987 వరకు పంజాబ్ ముఖ్యమంత్రి గానూ ఉన్నారు.
2000 నుంచి 2011 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా సేవలందించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







