దుబాయ్ వేవ్ రెసోనెన్సు ఈవెంట్స్ ఆధ్వర్యంలో వైభవంగా 'సంక్రాతి సంబరాలు'
- January 15, 2017
దుబాయ్ లో ని తెలుగు వారందరికీ సంక్రాంతి ఒకరోజు ముందుగానే వచ్చేసింది. వేవ్ రెసోనెన్సు ఈవెంట్స్ సంస్థ ఇక్కడి తెలుగు వారందరికోసం ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకలు జరపటం ఆనవాయితీ. అలాగే ఈ సంవత్సరం కూడా షార్జాలో మరుబెల్లా రిసార్ట్ లో ఈ వేడుకల్ని ఏర్పాటు చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని తెలుగు వారంతా ఈ వేడుకకి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పిల్లలంతా సాంప్రదాయ వస్త్రధారణతో ఇండియాలో జరుపుకునే పద్ధతులకి ఏ మాత్రం తీసిపోకుండా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గృహిణులకు ముగ్గుల పోటీలు , పిల్లలకి డ్రాయింగ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందచేశారు. మగవారంతా ఫాషన్ వాక్ , డాన్సులతో అదరగొట్టారు. ఇటీవల ప్రవాసీ మిత్ర అవార్డు అందుకున్న మజూన్ మెకానికల్ సర్వీసెస్ అధినేత ఎరికి తులసి ప్రసాద్ మరియు మాగల్ఫ్.కామ్ అధినేత శ్రీకాంత్ చిత్తర్వు ని తెలుగు వారంతా అభినందించారు. వేడుకల్లో పాల్గొన్న వారి పేర్లను లక్కీ డిప్ తీయగా ఇండియా కి తిరుగు ప్రయాణ టికెట్ ను షార్జాకి చెందిన ప్రియా శ్రీరామ్ గెలుచుకున్నారు. ఉదయం 10:30 నిమిషాలకి ప్రారంభమైన వేడుకలు సాయంత్రం 6 గంటల వరకు అవిశ్రాంతం గా కొనసాగాయి. చివర్లో తంబోలా నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు. ప్రముఖ సంఘసేవకురాలు శ్రీమతి ఉమా పద్మనాభం కార్యక్రమాన్ని అంతా పర్యవేక్షిస్తూ అతిథులతో ఉల్లాసంగా గడిపారు. ఈ సంవత్సరంతో వేవ్ సంస్థ స్థాపించి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఏప్రిల్ 2 8 న పెద్ద ఎత్తున వేడుకల్ని నిర్వహించనున్నట్లు వేవ్ వ్యవస్థాపకులు శ్రీ గీతా రమేష్ తెలిపారు. దుబాయ్ లో ఇలాంటి వేడుకల్ని నిర్వహించటానికి ప్రభుత్వం నుండి ఆయా సంస్థ కి అనుమతి తప్పని సరి. తెలుగు సంస్థల్లో ఆ అనుమతి కలిగిన ఏకైన సంస్థ వేవ్ అని సంస్థ అధినేత రమేష్ బాబు తెలిపారు. ఈ ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని తెలుగువారి వేడుకలు జరుపుతామని తెలియచేసారు. ఆద్యంతం ఈ కార్యక్రమాన్ని సుధా విజయకుమార్ , ప్రశాంతి , రమేష్ లు తమ వ్యాఖ్యానంతో ఆహ్లాదకరంగా నిర్వహించారు. కోడి పందాలు, గంగిరెద్దులు ఉంటే కనుక ఇక ఈ పండక్కి ఇండియా వెళ్లనవసరం లేదు అని అతిథులంతా ఛలోక్తులు విసురుకున్నారు. ఈ వేడుకకి చెన్నై కి చెందిన ఆర్ ఎం కె కంస్ట్రక్షన్స్ అండ్ హోసింగ్ వారు స్పాన్సర్ గా వ్యవహరించారు.





తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







