విడుదలైన 'నేను లోకల్' ఆడియో.!
- January 15, 2017
'ఈ కార్యక్రమానికి వచ్చిన అభిమానులను చూస్తుంటే సముద్రం అటుందో ఇటుందో అర్థం కావడం లేదు. హైదరాబాద్‌లో ఉంటే 'నేను లోకల్' అని చెప్పేవాడిని కాని ఇప్పుడు మీరు చెప్పండి 'నేను లోకల్' అని అంటున్నాడు' సినిమా హీరో నాని. సంక్రాంతి సందర్భంగా కాకినాడలో 'నేను లోకల్' సినిమా ఆడియో కార్యక్రమం జరిగింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ తొలిసారిగా నాని చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రంలో కీర్తిసురేశ్ హీరోయిన్‌గా నటిస్తుంది. నాని మాట్లాడుతూ 'ఆడియో పంక్షన్‌కు బయలుదేరి వస్తుండగా ఈ ప్రాంతం దేనికి ప్రత్యేకమని కీర్తి అడిగింది.
నేను కాకినాడ కాజా అని చెప్పా. కాజా అంటే ఏమిటని మళ్లీ అడిగింది. దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. కాకినాడ కాజా తిని ఆస్వాదించాల్సిందే.
అలాగే నేను లోకల్ గురించి కూడా ఏం చెప్పాలో తెలియడం లేదు. సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. దిల్ రాజుతో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం ఇప్పుడు కుదిరింది. యూనిట్ మొత్తం ఎంతో కష్టపడి పని చేశారు.
కీర్తీ సురేశ్ చాలా బాగా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన స్వరాలు అందించారు'' అని అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ ''తెలుగు సినీ పరిశ్రమ పుట్టినప్పుడు ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణగారు, కృష్ణంరాజుగారు, శోభన్‌బాబుగారు వీళ్లంతా స్వయం కృషితో పైకి వచ్చారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వచ్చి ఇరగ్గొట్టేశారు.
ఆ తర్వాత ఈ 30 ఏళ్లలో రవితేజ, ఇప్పుడు నాని ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చారు. అందుకే నేచురల్ స్టార్ అని పేరొచ్చింది. నేను లోకల్ సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతోంది. అతను చేయాల్సిన కృషి అంతా చేశాడు.
'సినిమా చూపిస్త మావ' చిత్ర బృందం మొత్తం ఈ సినిమా కోసం పని చేసింది. ఈ చిత్రాన్ని పిబ్రవరిలో విడుదల చేస్తాం'' అని చెప్పారు. దేవిశ్రీ మాట్లాడుతూ ఆనందం అంటే డబ్బులోనో, మరోదానిలోనో కాదు మీరు కొట్టే చప్పట్లలో ఉంటుందని ప్రేక్షకులను హుషారెక్కించారు. నేను లోకల్ చిత్రం చాలా పెద్ద హిట్ అవుతోందన్నారు.
నాని చాలా చక్కగా నటించాడు. కీర్తి కూడా చాలాబాగా చేసింది. ఇలాంటి మంచి చిత్రాలు నిర్మిస్తూ మాకు అవకాశం కల్పిస్తున్న దిల్‌రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ముగించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







