పెసర పునుకుల బిర్యానీ
- January 15, 2017
కావలసిన పదార్థాలు : పెసరపప్పు - 159 గ్రా, బాస్మతి బియ్యం - అరకిలో, యాలకులు - 4, లవంగాలు - 8, దాల్చినచెక్క - రెండు ముక్కలు, బిర్యాని ఆకులు - రెండు, సాజీరా - చెంచా
అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు చెంచాలు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిరపకాయలు - 8, కొత్తిమీర - కట్ట, పుదీనా - కట్ట, నూనె - సరిపడా, నెయ్యి - చెంచా
ఉప్పు - తగినంత, నీళ్లు - సరిపడా
తయారీ విధానం :
పెసరపప్పును రెండు గంటల ముందు నానబెట్టాలి. నానిన పప్పును కొంచెం బరకగా రుబ్బుకుని కొంచెం ఉప్పు కలుపుకోవాలి. బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత రుబ్బిపెట్టుకున్న పెసరపిండిని చిన్న చిన్న పునుకులుగా వేసి వేయించుకోవాలి. తర్వాత బాస్మతి బియాన్ని కడిగి పది నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నెలో నెయ్యి, నూనె పోసి కాగిన తర్వాత లవంగాలు, సాజీరా, యాలకులు, దాల్చినచెక్క, బిర్యానిఆకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా వేసి వేగిన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న బియ్యాన్ని రెండు నిమిషాలు వేయించి, బియ్యానికి రెండు రెట్లు నీరు పోయాలి. సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. సగం ఉడికిన తర్వాత వేయించి పెట్టుకున్న పునుకులు, కొత్తిమీర వేసి కలిపి ఆవిరి పోకుండా మూతపెట్టి సన్నటి సెగపై ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి. అంతే పెసర పునుకుల బిర్యాని సిద్ధం.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







