కార్మిక వసతి వద్ద గల 10 మాన్ హోల్స్ కబ్జా .. దాచిన పలు వినియోగ వస్తువులు
- January 16, 2017
దుబాయ్:' శత కోటి దరిద్రాలకు....అనంత కోటి ఉపాయాలని ' మన తెలుగులో ఓ చక్కని సామెత ఉంది.. ఎడారి దేశంలో పగలంతా పని చేసి కార్మిక వసతి గృహాలలో ఉన్నఇరుకు గదులలో కాళ్ళు ముడుచుకొని పడుకొనే స్థలం దొరకడమే అదృష్టం...ఇక వస్తువులను దాచుకొనే అవకాశం ఏది ? దీనితో కొందరు కార్మికులకు మురికి కాలువల మీద ఉండే మాన్ హోల్స్ నెల మాళిగ పెట్టెల మాదిరిగా బహుశా కనిపించాయేమో ?? మూతలు తెరిచి తమ పరికరాలు, దుస్తులు తదితర వస్తువులను శుభ్రంగా ప్లాస్టిక్ కవర్లలో చుట్టి దాచుకున్నారు. ముహాసనః ఒక కార్మిక వసతిని వద్ద తొలుత ఇవేమిటో తెలియక దుబాయ్ మున్సిపాలిటీ ఏ నేరమో ..ఘోరమో జరిగి ఉంటుందని అప్రమత్తమైపోయారు. పర్యావరణ అత్యవసర కార్యాలయ తనిఖీ అధికారులు రంగంలోనికి దిగి మాన్ హోల్ లోని ప్లాస్టిక్ బ్యాగులను పరిశీలించగా అందులో వినియోగ వస్తువులు..చిరు వ్యాపారాల సరుకుని ఇందులో నిల్వ చేసేందుకు ఉపయోగిస్తున్నారని తెల్సుకొని ఆశ్చర్యానికి లోనయ్యారు. వారి పరిశీలనలో ఇటువంటి మాన్ హోల్స్ 10 వరకు కనుగొన్నారు. కొందరు కార్మికుల కార్మిక వసతి స్టోర్ వంటసామగ్రి, దుప్పట్లు, పరికరాలు , తివాచీలు, అలాగే వివిధ గృహోపకరణాలు మరియు ఉపకరణాలు నేలమట్టంలో దాచుకున్నారు. కొందరు కార్మికులు పార్టీ టైం చిరు వ్యాపారాలు చేసేందుకు వీలైన సరుకులను ఇందులో భద్రపరచి ప్రజలకు అమ్మే ప్రణాళికలో భాగంగా ఈ మాన్ హోల్స్ కబ్జా చేశారు సుమారు 30 టన్నుల వరకు వివిధ రకాల వస్తువులతో మాన్ హోల్స్ నిండిపోయాయని ఒక అంచనా. వీటిని తాము స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశామని దుబాయ్ మున్సిపాలిటీ పర్యావరణ అత్యవసర కార్యాలయం యొక్క ముఖ్యాధికారి మహమ్మద్ అబ్బాస్ అల్ బ్లౌషి తెలిపారు. ఆసియా దేశాల సంతతికి చెందిన కొంతమంది ఈ వినిమయ వస్తువుల నిల్వ చేశారని ఆయన ఒక ప్రశ్నకు జవాబిచ్చారు. వారు మాన్ హోల్స్ లోపల సరుకు భద్రపర్చడమే కాక వారి వస్తువులు అక్కడ ఉన్నట్లుగా తమ తోటివారు అక్కడకు పోటీకి రాకుండా ఉండేందుకు అందుకు గుర్తుగా పాత చెక్కలు మరియు డబ్బాలు మాన్ హోల్స్ పై ఉంచేవారు. అవి అక్కడ ఎందుకు ఉంటున్నాయని పరిశీలన జరిపితే ఈ గుప్త సరుకుల గుట్టు తెల్సిందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!







