విజిట్‌ వీసాతో వచ్చి బహ్రెయిన్‌లో మృతిచెందిన మహిళ..

- January 16, 2017 , by Maagulf
విజిట్‌ వీసాతో వచ్చి బహ్రెయిన్‌లో మృతిచెందిన మహిళ..

65 ఏళ్ళ మహిళ ఒకరు బహ్రెయిన్‌కి విజిట్‌ వీసాపైన వచ్చి, గుండెపోటుతో మరణించారు. భారతదేశంలోని కేరళకు చెందిన 65 ఏళ్ళ శారద శంకర్‌, అద్లియాలో తన కుమారుడు నివాసం ఉంటున్న అకామడేషన్‌కి వచ్చారు. దురదృష్టవశాత్తూ ఆమెకు గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. మృతురాలి ఇద్దరి కుమారులు సుధీష్‌ కుమార్‌, సురేష్‌బాబు బహ్రెయిన్‌లోనే ఉన్నారు. ఆమెకు మొత్తం ఐదుగురు సంతానం. స్నేహితురాలు నారాయణితో కలిసి బహ్రెయిన్‌కి వచ్చారు శారద. పాస్‌పోర్ట్‌ సమస్యలతో ఆమె తిరుగు ప్రయాణం కాస్త ఆలస్యమవగా, ఇంతలోనే ఆమెను మృత్యువు వెంటాడింది. డిసెంబర్‌ 26న నారాయణి బహ్రెయిన్‌కి రాగా, జనవరి 13న శారద బహ్రెయిన్‌కి చేరుకున్నారు. నారాయణి, శారద ఇద్దరూ సుధీష్‌కుమార్‌ ఫ్లాట్‌లోనే ఉండేవారు. టీవీ చూస్తుండగా, గుండెపోటు రావడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయారు. సలామియా మెడికల్‌ కాంప్లెక్స్‌ మార్చురీలో శారద మృతదేహాన్ని భద్రపరిచారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com