రెడ్‌లైట్ ప్రాంతాలు అవసరం అని చెప్పే చిత్రం 'శివప్పు ఎనక్కు పుడిక్కుం'..
- January 16, 2017
ముంబై లాంటి నగరాల్లో వేశ్యలకంటూ రెడ్‌లైట్ ప్రాంతాలు ఉన్న విషయం తెలిసిందే. చెన్నైలాంటి మహా నగరాల్లోనూ అలాంటి ప్రాంతాలు అవసరం అని చెప్పే చిత్రంగా శివప్పు ఎనక్కు పుడిక్కుం చిత్రం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు యురేకా తెలిపారు. ఈయన కథ, కథనం, మాటలు, దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ఇంతకు ముందు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న చిత్రాలను నిర్మించిన జే.సతీష్‌కుమార్ నిర్మించిన తాజా చిత్రం శివప్పు ఎనక్కు పుడిక్కుం. దర్శకుడు యురేకా ప్రధాన పాత్ర పోషించిన ఇందులో నటి శాండ్రా ఎమీ, బజార్‌బాబు, రోజామలర్, కామాక్షి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన చిత్ర వివరాలను తెలుపుతూ చెన్నై లాంటి మహా నగరాల్లో పలు రాష్ట్రాలకు చెందిన వారు, ఇతర దేశాలకు చెందిన వారు జీవనం సాగిస్తున్నారన్నారు. ఇలా నానాటికీ జనాభా పెరుగుతున్నట్లుగానే పడుపు వృత్తి అధికం అవుతుందన్నారు. దీంతో అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. అలాంటి అత్యాచారాలకు వ్యతిరేకమే తమ చిత్రం అని తెలిపారు. ఒక వేశ్య తన వద్దకు వచ్చే ఐదుగురి మనçస్తత్వాల గురించి ఒక రచయితకు వివరించే ఇతివృత్తమే ఈ చిత్రం అని తెలిపారు. అదే విధంగా వివాదాస్పద అంశం అయిన రెడ్‌లైట్ ప్రాంతాలు అవసరం అనే చెప్పే చిత్రంగా శివప్పు ఎనక్కు పుడిక్కుం ఉంటుందన్నారు. అయితే చిత్రంలో ఎలాంటి అశ్లీల సన్నివేశాలు చోటు చేసుకోవని తెలిపారు. సెన్సార్ సభ్యులు, విమర్శకులు, పత్రికల వారు ప్రశంసించిన చిత్రం ఇదని దర్శకుడు చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







