మస్కట్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు ..
- January 17, 2017
మస్కట్‌తోపాటు సుల్తానేట్‌లోని పలు ప్రాంతాల్లో సాధారణ నుంచి ఓ మోస్తరుగా వర్షాలు రానున్న మూడు రోజుల్లో కురిసే అవకాశం ఉందని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ యావియేషన్ ట్విట్టర్‌లో వెల్లడించింది. మెటియరాలజీ డిపార్ట్‌మెంట్ అధికారి ఒకరు మాట్లాడుతూ, ముసదామ్, సుర్, నార్త్ అండ్ సౌత్ షర్కియా, కోస్ట్‌లోని పలు ప్రాంతాల్లో రానున్న రోజుల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. వింటర్ సందర్భంగా ఒమన్‌లో వర్షాలు కురవడం మామూలేనని, 2015 డిసెంబర్‌లోనూ, గత ఏడాది జనవరిలోనూ వర్షాలు కురిశాయని తెలిపారు. వర్షాలతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోనున్నాయి. ఉష్ణోగ్రత 23 డిగ్రీలకు అటూ ఇటూగా ఉండొచ్చు. రాత్రి ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకూ పడిపోవచ్చు. సముద్రం రఫ్‌గా ఉంటుంది గనుక, చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్ళేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- వాట్సాప్ అంకుల్స్ పై ఇన్‌స్టా పిల్లలు గెలిచారు: కేటీఆర్
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..
- అమర్నాథ్ భక్తులకు గుడ్ న్యూస్..
- దుబాయ్‌లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్‌లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!
- తెలంగాణలో ‘వైన్ టూరిజం’..
- సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ఫిక్స్
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!







