యాప్‌ ద్వారా శ్రీవారి దర్శన టికెట్లు త్వరలో..

- January 17, 2017 , by Maagulf
యాప్‌ ద్వారా శ్రీవారి దర్శన టికెట్లు త్వరలో..

ఆన్‌లైన్‌లో రూ.300 టిక్కెట్ల సంఖ్యను 6 నుంచి 10కి పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) నిర్ణయం తీసుకుంది. మంగళవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో అధికారులతో ఈవో సాంబశివరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలను తీసుకున్నారు. గతంలో ఒకసారి ఒక్కొక్కరు 6 టికెట్ల చొప్పున మాత్రమే అవకాశం ఉంది. మరో 45రోజుల్లో మొబైల్‌ అప్లికేషన్‌ రూపొందిస్తున్నట్లు ఈవో సాంబశివరావు తెలిపారు. యాప్‌ ద్వారా గదులు, టికెట్లు, ఈ-విరాళాలకు మరింత సులభతరం అవుతుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com