దుబాయ్ లో వైవిధ్యంగా కొలువుతీరిన బొమ్మలు
- January 17, 2017
తెలుగు వారి పెద్ద పండుగ అయిన సంక్రాంతి కి సంప్రదాయం ప్రకారం బొమ్మల కొలువును షార్జాలో వుంటున్న శ్రీ రవికుమార్ మరియు కామేశ్వరి దంపతుల ఇంట కొలువు తీర్చారు. ఇందులో ప్రత్యేకంగా సంపూర్ణ రామాయణమును అత్యంత అద్భుతంగా నారద మహర్షి వాల్మీకి కి సంక్షిప్త రామయణం చెప్పడం నుంచి వాల్మీకి వేటగానికి శాపం ఇవ్వడం తర్వాత బ్రహ్మ వాల్మీకి ని రామాయణం రచించమని ఆదేశించడం అట్లా రాసింది లవ కుశలతో అయోధ్యలో పాడించడం చాలా చక్కగా బొమ్మల రూపంలో ప్రదర్శించారు.
రామాయణం లో 6 కాండలను చాలా చక్కని రీతిలో వాల్మీకి రామాయణం ను కళ్ళకు కట్టినట్ట్లు చూపించారు. బంగారు జింకను, సీతను రావణుడు తీసుకెళ్ళడం, జటాయువుతో యుద్దం, వాలి సుగ్రీవుల యుద్దం, వాలిని చంపడం, హనుమంతుడు లంకకు ఎగరడం, అశోక వనం లో సీత, రామసేతు నిర్మాణం, హనుమంతుడు సంజీవని పర్వతం తీసుకుని రావడం అన్ని అంశాలను ఎంతో హృద్యంగా అమర్చి చూసిన ప్రేక్షకుల హృదయాలను రంజింపచేశారు. ఛివరి అంశమైన పుష్పక విమానం ను కూడా అమర్చి రామ పట్టాభిషేకం లో షార్జా, దుబాయ్ లో వున్న వారిని కూడా వుంచడం అందరిని అలరించింది.ఇక్కడి పిల్లలు ఎంతో ఉత్సాహంతో చూసి ఆనందించారు.
ఇటువంటి బొమ్మల కొలువు యు.ఏ.ఈ లో ప్రదర్శించడం ఇదే మొదటిసారి. ఇంతటి అద్భుతమైన బొమ్మల కొలువుతో పాటు రామాయణం ను కూడ ప్రదర్శించిన రవి మరియు కామేశ్వరి దంపతులకు అభినందనలు తెలుపుతోంది మా గల్ఫ్.కామ్







తాజా వార్తలు
- వాట్సాప్ అంకుల్స్ పై ఇన్స్టా పిల్లలు గెలిచారు: కేటీఆర్
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..
- అమర్నాథ్ భక్తులకు గుడ్ న్యూస్..
- దుబాయ్లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!
- తెలంగాణలో ‘వైన్ టూరిజం’..
- సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ఫిక్స్
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!







