కడీ పకోడీ..
- January 17, 2017
కావలసిన పదార్థాలు: శెనగపిండి- 120 గ్రాములు, వాము, పసుపు, కారం, మెంతులు, ధనియాలపొడి, సోంపు- అరటీస్పూను, పెరుగు- 150 గ్రాములు, ఉల్లిగడ్డ(సన్నగా తరిగి)- సగం, కొత్తిమీర తరుగు, జీలకర్ర- ఒకటీస్పూను చొప్పున, ఎండుమిరపకాయలు- ఆరు, ఆవనూనె- మూడు టేబుల్‌స్పూన్లు, కరివేపాకు- ఎనిమిది రెబ్బలు, పచ్చిమిర్చి చీలికలు- మూడు, ఇంగువ- చిటికెడు, ఉప్పు- తగినంత.
తయారీ విధానం: ఒక గిన్నెలో పెరుగు, ఒకటిన్నర కప్పు నీళ్లు, శెనగపిండి సగం, కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లోకి తీసుకొని ఇరవై నిమిషాలపాటు చిన్నమంటపై ఉడికించాలి. మరొక పాన్‌లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి మూడు, సోంపు, ధనియాలపొడి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ వేగించాలి. దీనిలో శెనగపిండి,పెరుగు మిశ్రమం వేసి ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. వేరొక గిన్నెలో మిగిలిన శెనగపిండి, వాము, కారం, పసుపు, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో చిన్న చిన్న ఉండలు చేసి గారెల్లా వత్తుకొని నూనెలో కాల్చాలి. వీటిని శెనగపిండి పెరుగు మిశ్రమంలో వేయాలి. అంతే పంజాబీ సంక్రాంతి స్పెషల్ కడీ పకోడీ రెడీ.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







