ఇస్రో శాస్త్రజ్ఞులు మన దేశానికి పేరు, కోట్ల ఆదాయం తెస్తోన్న ఇస్రో...
- January 18, 2017
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తన ప్రయోగాల పరంపరలో మరో అద్భుతాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో ఆవిష్కరించనున్నది.. పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా 1,392 కిలోల బరువు కలిగిన 103 ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. దీనికి సంబంధించిన మిషన్ రెడీనెస్ రివ్యూ కమిటీ ఛైర్మన్ బీఎన్ సురేష్ ఆద్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఇస్రో రోదసీలోకి పంపనున్న 103 ఉపగ్రహాల్లో దేశీయంగా కార్టోశాట్-2 సిరీస్, రెండు ఇస్రో నానో శాటిలైట్లతోపాటు నెదర్లాండ్, స్విట్జర్లాండ్, అమెరికాకు చెందిన 100 చిన్నతరహా ఉపగ్రహాలు ఉన్నాయి. ఇందుకోసం షార్‌లోని మొదటి ప్రయోగ వేదికపై ఇప్పటికే మూడు దశల రాకెట్ అనుసంధాన పనులను పూర్తి చేశారు. ఉపగ్రహాలు రాగానే నాలుగోదశ పనులు పూర్తి చేసి కౌంట్ డౌన్ ప్రారంభిస్తారు.. ఒకే సారి అత్యధిక ఉపగ్రహాల్ని పంపిన మొదటి దేశంగా భారత్ ఆవిర్భించబోతున్నది.. కాగా మన దేశానికి పేరు తెస్తూ... దాదాపు 1500 కోట్ల ఆదాయాన్ని కూడా తెస్తోన్న ఇస్రో శాస్త్రజ్ఞుల ఘనతను మనం సగర్వంగా చాటి చెబుదాం.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







