30,000 దిర్హామ్‌ల లంచం తీసుకున్న ఎమిరేటీ అధికారి..
- January 18, 2017
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ ఎఫైర్స్ అధికారి 30,000 దిర్హామ్‌ల లంచం 9 మంది వ్యక్తుల నుంచి తీసుకున్నట్లుగా తేలింది. ఎగ్జిట్ పాస్‌లు ఇచ్చేందుకుగాను ఆ అధికారి ఈ లంచాన్ని తీసుకున్నారు. కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్, 35 ఏళ్ళ ఎమిరేటీ అధికారిని దోషిగా తేల్చింది. ఫాలో అప్ అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఈ అధికారి పనిచేస్తున్నారు. 445,700 దిర్హామ్‌ల విలువైన ఎక్స్‌పైర్డ్ రెసిడెన్సీ వీసా మరియు డిపాచ్యూర్ ఫీజుల్ని మాఫీ చేసేందుకుగాను ఆ అధికారి లంచం తీసుకున్నారు. 2015, డిసెంబర్ 24 నాటి ఘటన ఇది. ఈ ఘటనలో మధ్యవర్తిగా వ్యవహరించిన 35 ఏళ్ళ బంగ్లాదేశీ వ్యక్తిపైనా అభియోగాలు నమోదయ్యాయి. లంచం ఇవ్వజూపినవారిలో నలుగురు బంగ్లాదేశీలు, ఇద్దరు పాకిస్తానీలు, ఇద్దరు ఇండియన్స్ ఉన్నారు. చట్ట వ్యతిరేకంగా ఎగ్జిట్ పాస్‌లు ఇవ్వడం, ఫోర్జరీకి పాల్పడటం తదితర నేరాలు నిందితుడిపై మోపబడ్డాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







