ఆదిత్య999 లో కొడుకుతో కలిసి నటించనున్న బాలయ్య
- January 18, 2017
నటసింహం నందమూరి బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి విజయంతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రజలకి కృతజ్ఞతలు తెలిపే పనిలో భాగంగా ఈ రోజు తన టీంతో కలిసి అమెరికాకి బయలుదేరనున్నాడు. మరోవైపు తన కుమారుడి తెరంగేట్రం పై వస్తున్న వార్తలపై ఎట్టకేలకు స్పందించాడు. తాజాగా ఓ సందర్భంలో బాలకృష్ణ మాట్లాడుతూ, ఈ ఏడాది మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం ఉంటుందంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించాడు. తొలి చిత్రాల్లో మోక్షజ్ఞ లవర్ బాయ్ గానే కనిపిస్తాడనీ .. అయితే ఎక్కువ కాలం అదే తరహా పాత్రల్లో కనిపించడానికి తమ అభిమానులు ఒప్పుకోరని అన్నారు. ఆదిత్య999 కథ అయితేనే తనకి మోక్షజ్ఞకి సరిపోయే కథ అవుతుందని అలాగే కథల విషయంలో ఏనాడూ తన జడ్జ్మెంట్ తప్పు కాలేదని చెప్పాడు. ఇప్పటికే ఆదిత్య999కి సంబంధించి బౌండ్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు. చివరగా ఈ ఒక్క సినిమాలోనే తన కొడుకు పక్కన నటిస్తానని ఆ తర్వాత కలిసి నటించే యోచన ప్రస్తుతానికైతే లేదని మనసులో మాట చెప్పాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







