ప్రధాని మోదీని కలిసిన పన్నీర్‌సెల్వం..

- January 18, 2017 , by Maagulf
ప్రధాని మోదీని కలిసిన పన్నీర్‌సెల్వం..

దిల్లీ: తమిళుల సాంప్రదాయ క్రీడ జల్లికట్టుపై పంచాయతీ దిల్లీకి చేరింది. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. జల్లికట్టుపై నిషేధం తొలగించేలా ఆర్డినెన్స్‌ జారీ చేయాలని ప్రధానిని కోరారు. ఈ విషయంతో త్వరితగతిన నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రంలో శాంతిభద్రల సమస్య తలెత్తే అవకాశం ఉందని ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు.
జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధం విధించడంతో తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి చెన్నైలోని మెరీనా బీచ్‌కు ప్రజలు తరలివస్తున్నారు. శాంతియుత పద్ధతిలో తమ ఆందోళన కొనసాగిస్తున్నారు.
వీరికి మద్దతుగా పలువురు సినీనటులు కూడా ఆందోళనలో పాల్గొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com