పుట్టినరోజు శుభాకాంక్షలు 'మిస్టర్‌'కు...

- January 19, 2017 , by Maagulf
పుట్టినరోజు శుభాకాంక్షలు 'మిస్టర్‌'కు...

హైదరాబాద్‌: 'ముకుంద'తో మెగా వారసుడుగా వెండితెరకు పరిచయమై 'కంచె', 'లోఫర్‌' చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునాడు వరుణ్‌తేజ్‌. త్వరలో 'మిస్టర్‌'గా ప్రేక్షకుల ముందుకు రానున్న వరుణ్‌తేజ్‌ గురువారం పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా 'మిస్టర్‌' చిత్ర బృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి మిక్కీ జే మేయర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com