రోమ్ హోటల్ లో దారుణం, 30 మంది మృతి
- January 19, 2017
రోమ్: ఇటలీలో ప్రకృతి ప్రకోపానికి 30మంది బలైనట్లు తెలుస్తోంది. ఓ పర్వతం పక్కనే ఉన్న హోటల్‌పై ఓ భారీ కొండచరియ విరిగి పడటంతో వారంతా మృత్యువాత పడినట్లు సమాచారం. అంతకుముందు రోజు ఏర్పడిన భూకంపాలే ఈ దుర్ఘటనకు కారణమని తెలుస్తోంది. ఇటలీ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం నాలుగుసార్లు శక్తిమంతమైన ప్రకంపనలు వచ్చాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్ని ఈ భూప్రకంపనల కారణంగా కొన్ని క్షణాలపాటు వణికిపోయాయి.
అదే సమయంలో గ్రాన్ సాసో పర్వతం పక్కనే రిగోపియానో అనే హోటల్‌పై దాదాపు రెండు మీటర్ల వెడల్పు, ఆరు అడుగుల ఎత్తుతో ఓ భారీ మంచుకొండచరియ విరిగి పడింది. దీంతో అందులో పనిచేసే సిబ్బంది, అతిథులు, ఇతరులు మొత్తం 30మంది వరకు దీనికింద పడి నలిగిపోయారు. ఇంకా ఎక్కువమందే చనిపోయి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆ పర్వతాల్లో గస్తీ కాసే పోలీసులు వెంటనే హెలికాప్టర్ ద్వారా అక్కడి చేరుకుని మృతదేహాలను వెలికి తీయడంతోపాటు గాయపడిన వారిని రక్షించే చర్యలు ప్రారంభించారు. ఆ మంచుకొండ దెబ్బకి ఆ హోటల్ పది మీటర్ల ముందుకు కదిలిందట.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







