పాన్ తప్పదు రూ.30,000 లావాదేవీలకు...
- January 20, 2017
న్యూఢిల్లీ: నగదు లావాదేవీలను వీలైనంత వరకు తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ఇందుకోసం మరిన్ని చర్యలు తీసుకోబోతోంది. ఇందులో భాగంగా రూ.30,000 లేదా అంతకు మించి నగదు లావాదేవీ జరిపితే పాన్ నెంబర్ కోట్ చేయడాన్ని తప్పనిసరి చే యాలని యోచిస్తోంది. ప్రస్తు తం రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీ జరిపినప్పుడు తప్పనిసరిగా పాన్ నెంబర్‌ను వెల్లడించాలన్న నిబంధన అమల్లో ఉంది. వచ్చే బడ్జెట్‌లో ఈ పరిమితిని రూ.30 వేలకు కుదించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. 'వీటికి తోడు ఒక పరిమితికి మించి చేసే నగదు లావాదేవీలపై 'నగదు నిర్వహణ' చార్జీలు వసూలు చేయాలని కూడా యోచిస్తోంది' అని అధికార వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ఏదైనా వ్యాపార లావాదేవీల్లో నగదు చెల్లింపు రూ.2 లక్షలు లేదా అంతకు మించితే పాన్ నెంబర్ కోట్ చేయాలి. వచ్చే బడ్జెట్‌లో దీన్ని రూ.లక్షకు కుదించే అవకాశం ఉందని సమాచారం. కాగా ప్రస్తుతం ఎటిఎం నుం చి నెలకు ఐదుసార్లు ఉచితంగా లావాదేవీలు నిర్వహించే సదుపాయం ఉంది. దీన్ని మూడుకు తగ్గించే అవకాశం ఉంది.
రూ.10 లక్షలున్నా చెప్పాల్సిందే.. బ్యాంకు ఖాతాల్లోని డిపాజిట్లు, క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే చెల్లింపులపైనా ఆదాయ పన్ను శాఖ నిఘా పెట్టింది. ఖాతాదారుడి బ్యాంకు ఖాతాలో డిపాజిట్లు ఏడాది కాలంలో రూ.10 లక్షలకు చేరితే బ్యాంకులు ఆ విషయాన్ని ఐటి శాఖకు తెలపాలని సిబిడిటి కోరింది. క్రెడిట్ కార్డు బిల్లులు, నగదు చెల్లింపులు రూ.లక్ష దాటినా ఆ వివరాలను ఐటి శాఖకు వెల్లడించాలని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!







