నవదీప్ 'నటుడు'...
- January 20, 2017
యంగ్ హీరో నవదీప్, కావ్యా శెట్టి హీరోహీరోయిన్లుగా కొప్పుల రాజేశ్వరీదేవి సమర్పణలో లెజెండ్ పిక్చర్స్ పతాకంపై ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో రమేష్‌బాబు కొప్పుల నిర్మిస్తున్న సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'నటుడు'. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆడియన్స్‌ని థ్రిల్ చేసే మూవీ ఇది!!
హీరో నవదీప్ మాట్లాడుతూ - ''దర్శకుడు ప్రసాద్ నేరేట్ చేసిన సబ్జెక్ట్ నాకు చాలా థ్రిల్లింగ్‌గా అన్పించడంతో వెంటనే ఈ చిత్రంలో నటించాను. సినిమా చాలా బాగా వచ్చింది. నటుడిగా నన్ను మరో మెట్టు ఎక్కించే చిత్రం అవుతుందని కాన్ఫిడెన్స్‌తో వున్నాను. రమేష్‌బాబు పక్కా ప్లానింగ్‌తో అనుకున్న సమయంలో సినిమాని బాగా రూపొందించారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో వున్నాయి. డెఫినెట్‌గా ఆడియన్స్‌కి రీచ్ అయ్యే సినిమా ఇది. త్వరలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు'' అన్నారు.
సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల్లో డిఫరెంట్ సినిమా!!
నిర్మాత రమేష్‌బాబు కొప్పుల మాట్లాడుతూ - ''మానవ సంబంధాల నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించాం. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో కథను ట్రీట్ చేసే విధానంలో కొత్తదనం వుండటంతో సినిమాలు మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. ఆ సినిమాల కోవలో మా 'నటుడు' చిత్రం కూడా చేరుతుంది. ఈ చిత్రం సబ్జెక్ట్ సస్పెన్సతో రన్ అవుతూ ఆడియన్స్‌ని థ్రిల్ చేసే విధంగా వుంటుంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఫిబ్రవరిలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం'' అన్నారు.
యూత్‌కి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్!!
దర్శకుడు ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ మాట్లాడుతూ - ''మానవ సంబంధాలతో వ్యాపారం చేసే ఓ కుర్రాడి కథ ఇది. ప్రేమలోని ఒక సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తీశాం. ప్రేమల్ని అమ్మడం, కొనడం అనే కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రం వుంటుంది. నవదీప్ కథ మీద నమ్మకంతో ప్రాణం పెట్టి ఈ సినిమా చేసారు. నవదీప్ అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్ చేశారు. నవదీప్‌కి ఈ చిత్రంతో నటుడిగా మరింత మంచి పేరు వస్తుంది. మా నిర్మాత రమేష్‌బాబు అందించిన సహకారంతో చిత్రాన్ని అనుకున్న బడ్జెట్‌లోనే తీయడం జరిగింది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇంతవరకు చూడని ఓ కొత్త క్యారెక్టర్‌లో నవదీప్‌ని ప్రజెంట్ చెయ్యడం జరిగింది. ప్రజెంట్ యూత్‌కి ఒక రిప్రజెంటేటివ్‌లా ఈ సినిమా వుంటుంది. నేను ఏదైతే అనుకొని ఇండస్ట్రీకి వచ్చానో ఖచ్చితంగా అది ఈ చిత్రంతో నెరవేరుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాను'' అన్నారు.
నవదీప్, కావ్యాశెట్టి, నాగినీడు, సూర్య, సత్య, ఆశిష్ గాంధీ, జియా తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా:వాసు, సంగీతం: జయసూర్య, రీ-రికార్డింగ్: చిన్నా, ఎడిటింగ్: నాగిరెడ్డి, కో-డైరెక్టర్ శేషుకుమార్, అసోసియేట్ డైరెక్టర్స్: మజ్జి కిషోర్, తిరునగరి ప్రవీణ్, రాజేంద్ర, కాస్ట్యూమ్స్: సి.వి.ఎం.ఆనంద్, నిర్మాత: రమేష్‌బాబు కొప్పుల,
కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







