సెన్సార్‌ పూర్తిచేసుకున్న 'నటుడు'

- January 20, 2017 , by Maagulf
సెన్సార్‌ పూర్తిచేసుకున్న 'నటుడు'

యువ కథానాయకుడు నవదీప్‌, కావ్యశెట్టి జంటగా నటించిన చిత్రం 'నటుడు'. ఎన్‌.ఎస్‌.ఆర్‌ ప్రసాద్‌కొప్పుల దర్శకుడు. రాజేశ్వరిదేవి సమర్పణలో లెజెండ్‌ పిక్చర్స్‌ పతాకంపై రమేశ్‌బాబు కొప్పుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
హీరో నవదీప్‌ మాట్లాడుతూ 'దర్శకుడు ప్రసాద్‌ చెప్పిన సబ్జెక్ట్‌ నాకుచాలా థ్రిల్లింగ్‌గా అనిపించడంతో వెంటనే ఈ చిత్రంలో నటించడానికి ఒప్పేసుకున్నాను. సినిమా చాలా బాగా వచ్చింది. నటుడిగా నన్ను మరో మెట్టు ఎక్కించే చిత్రం అవుతుందన్న నమ్మకంతో ఉన్నాను. రమేశ్‌ బాబు పక్కా ప్రణాళికతో అనుకున్న సమయంలో సినిమాని బాగా రూపొందించారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో ఉన్నాయి.'' అని చెప్పారు. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com