'థియేటర్ ఆన్ డిమాండ్' సర్వీస్ ను ప్రారంభించిన పీవీఆర్ సినిమాస్
- January 20, 2017
మల్టిప్లెక్స్ చైన్ ఆపరేటర్ పీవీఆర్ సినిమాస్ సంస్థ థియేటర్ ఆన్ డిమాండ్ సర్వీస్ 'వీకేఏఏఓ'ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి థియేటర్ ఆన్ డిమాండ్ సేవల్లో వంద స్క్రీన్లను చేర్చనున్నట్లు పీవీఆర్ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికి 30 స్క్రీన్స్‌ను చేర్చనుంది. వీకేఏఏఓ వెబ్ ప్లాట్‌ఫాం ద్వారా ఎవరైనా తమకు నచ్చిన సినిమాలను తమకు నచ్చిన థియేటర్లలో నచ్చిన సమయంలో వేయించుకోవచ్చు. అయితే షో వేయడానికి కనీసం 50 సీట్లు బుక్ కావాల్సి ఉంటుంది. కొత్తగా ఏర్పాటు చేసే స్క్రీన్లలో సగం ఇప్పటికే తమ సేవలు ఉన్న నగరాల్లో, మిగతావి కొత్త నగరాల్లో ఏర్పాటు చేస్తామని పీవీఆర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజ్లి తెలిపారు. ప్రస్తుతం వివిధ భాషలు, జోనర్లలో 500 సినిమాలతో ఈ సేవలు ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







