బహ్రెయిన్ ఇండియన్ స్కూల్లో గ్రీన్ డ్రైవ్ ...
- January 21, 2017
బుడైయా బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ విద్యార్థులు, ప్రకృతి, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. బిఐఎస్ ఎడ్యుకేటర్ క్షమా పాండే నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. గుడ్ లిట్టర్ సర్వే పేరుతో, స్కూల్లోని డస్ట్బిన్లలో ఎలాంటి చెత్త రోజూ సమీకృతమవుతుందో పరిశీలించారు. ప్లాస్టిక్ వాడకంపైనా వివిధ క్లాసులకు వెళ్ళి ప్రచారం చేశారు. పోస్టర్లు, ఇన్స్పిరేషనల్ వీడియోస్, ఎన్విరాన్మెంటల్ బ్రోచర్స్, సర్వే రిపోర్టులతో ఈ కార్యక్రమం జరిగింది. బిఐఎస్ డైరెక్టర్ రితు వర్మ మాట్లాడుతూ, విద్యార్థుల ఇంట్రెస్ట్‌కి అభినందనలు తెలిపారు. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా అందరిలోనూ పరిశుభ్రత పట్ల అవగాహన పెరుగుతుందనీ, ప్రకృతి పరిరక్షణలో మనమెలా భాగమవ్వాలన్నది పిల్లల్లోనే అవగాహన రావడం వల్ల సమాజానికి మేలు జరుగుతుందని చెప్పారు. విద్యార్థులు రీయూజబుల్ ఉత్పత్తులనే ఎక్కువగా వినియోగించాలని ఈ సందర్బంగా కోఆర్డినేటర్ డాక్టర్ ప్రీత్ కమల్ భట్నాగర్ చెప్పారు.
దుబాయ్‌కి చెందిన ఎన్ఆర్ఐ ఫిలిం మేకర్ మరియు బిజినెస్ మేన్ సోహన్ రాయ్, భారతీయ సినీ రంగంలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. ప్రొడక్షన్, స్క్రీనింగ్ మరియు మార్కెటింగ్ స్ట్రాటజీస్ అలాగే ఇండియన్ సినిమా బిజినెస్ మోడల్‌కి సంబంధించి పలు విభాగాల్లో సరికొత్త మార్పుల దిశగా ఈ పెట్టుబడులు ఉపకరిస్తాయని ఆయన అన్నారు. మెరైన్ ఇంజనీర్ అయిన రాయ్ సినీ దర్శకుడిగా, నిర్మాతగా మారారు. ఇండియన్ సినిమాని గ్లోబల్ లెవల్‌కి తీసుకెళ్ళడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారాయన. డామ్999 సినిమాని అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా రూపొందించరు సోహన్ రాయ్. కొత్తగా మల్టీప్లెక్సుల్ని నిర్మించడం, సినిమా మార్కెట్‌ని కొత్త పుంతలు తొక్కించడం, అలాగే సినీ నిర్మాణంలో టెక్నాలజీని వినియోగించడం, మార్కెటింగ్‌లోనూ సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్ళడం వంటి ప్రణాళికల్ని అమలు చేస్తామని చెప్పారు సోహన్ రాయ్. టాలీవుడ్, బాలీవుడ్ అనే విభజన రేఖలు లేకుండా ఇండీవుడ్ పేరుతో ఇండియన్ సినిమాని ఏకీకృతం చేసి, ప్రపంచ సినిమాతో పోటీ పడేలా మన సినిమాలుండాలని అభిప్రాయపడ్డారు సోహన్ రాయ్.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







