నేడు సుభాష్ చంద్ర బోస్ 120 వ జయంతి ..!!

- January 22, 2017 , by Maagulf
నేడు సుభాష్ చంద్ర బోస్ 120  వ  జయంతి ..!!

సుభాష్ చంద్రబోస్ నేతాజీ గా ప్రసిద్ధి గాంచిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు.  ప్రభావతి, జనకీనాథ్‌ బోస్‌ దంపతులకు ఒరిస్సాలోని కట్‌ లో జనవరి 23 వ తేదీ 1897 లో జన్మించాడు.  నేతాజీ సుభాష్‌     చంద్రబోస్‌ 1920 లండన్‌లో ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. చిత్తరంజన్‌ దాస్‌ ఈయనకు మార్గదర్శి. స్వాతంత్య్రోద్య మంలో పాల్గొని 1921లో అరెస్టయ్యాడు. కాంగ్రెస్‌లో కొంతకాలం కొనసాగిన తరువాత ఫార్వర్డ్‌ బ్లాక్‌ అనే పార్టీని స్థాపించాడు. 1941 లో బ్రిటీష్‌ పోలీసుల కన్నుగప్పి ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు.జర్మనీలోని ఒక జలాంత ర్గామిలో 90 రోజులు ప్రయాణించి ఆఫ్రికాను ప్రదక్షిణం చేసి హందూ మహాసముద్రం మీదుగా జపాన్‌ చేరుకున్నాడు. 1943లో ఇండి యన్‌ నేషనల్‌ ఆర్మీ (ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌) కి సర్వసైన్యాధిపతిగా నాయక త్వం వహించాడు. ‘యాన్‌ ఇండియన్‌ పిలిగ్రిమ్‌’ పేరుతో తన ఆత్మక థను రాశాడు.    ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు. ఇతని మరణం పై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు బావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక సువర్ణవకాశంగా బోసు భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయుల పై పొరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ మరియు జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యం ను ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్ధిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ దళంను సింగపూర్ లో ఏర్పరచాడు.బోసు రాజకీయ అభిప్రాయాలు, జర్మనీ మరియు జపానుతో అతని మిత్రత్వం పై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు వీటిని విమర్శిస్తే, మరి కొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోసును అభిమానిస్తారు. ఆయన జీవితం లాగే మరణం కూడా వివాదాస్పదమైంది. 18 ఆగస్టు, 1945 లో తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదం లో బోసు మరిణించాడని ప్రకటించినప్పటికి, అతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళారని పలువురు నమ్ముతారు.  బోస్ గొప్ప దేశభక్తుడు. తన అసమాన ప్రతిభాపాటవాల్తో దేశం వొదిలి ప్రపంచ నేతలతో సమాలోచనలు, సమావేశాలు నెరపి వేల మందితో భరతమాతను దాస్య శృంఖలాలనుంచి విడిపించటానికి జర్మనీలో నాలుగు వేలమందితో, తూర్పు ఆసియా ప్రాంతంలో ముప్పై వేలమందితో భారత విప్లవ సైన్యాన్ని తయారు చేశాడు. అదే క్రమంలో INA రంగూన్, ఇంఫాల్, అండమాన్ మరియు నికోబార్ (షహీద్ మరియు స్వరాజ్ పేర్లతో పిలవబడ్డాయి ) బ్రిటిష్ కబంధ హస్తాల్లోంచి విడిపించగలిగింది. ఎప్పుడు ఏ వైపు నుంచి దాడి చేస్తాడో తెలియకుండా కంటికి కునుకు లేకుండా గుబులు పుట్టిస్తూ బ్రిటిష్ వాళ్ల గుండెల్లో నిద్రపోయాడు. భారత భూ, నావికా దళ సైన్యాలు తమపైకే గురిపెట్టి ఎప్పుడు ఏ క్షణంలో తిరుగుబాటు చేస్తాయో తెలియని అయోమయ పరిస్థితి. ఆఖరి క్షణాల్లో(?) తన ముఖ్య అనుచరుడితో బోస్ చెప్పిన మాటలు బోస్ ఎంతటి దేశభక్తుడో, భారత ప్రజలకు స్వాతంత్ర్య సమర స్ఫూర్తినిచ్చి తమ శక్తేమిటో తెలియజేస్తాయి. 'నా దేశ ప్రజలకి నా సందేశాన్ని వినిపించండి. నేనింక కోలుకోలేనేమో. నా ఆఖరి శ్వాస వరకు నా దేశ విముక్తి కోసం పోరాడాను. ప్రజల్ని వెనుకంజ వేయొద్దని,స్వరాజ్యం అతి త్వరలో వస్తుందని చెప్పండి... జైహింద్.' నిస్వార్ధ దేశభక్తుడు, కోట్లమందికి ఆరాధ్యుడు , అయిన బోస్ లాంటి జాతి రత్నాన్ని భారత ప్రభుత్వం ఎలా గుర్తుపెట్టుకుందో చూడండి.ఒకసారి డిల్లీ వాస్తవ్యుడు దేవ్ ఆషిష్ భట్టాచార్య సమాచార హక్కు చట్టం కింద భారత స్వాతంత్ర్య సమరానికి నేతాజీ ఎటువంటి చేయూత నందించాడన్న సమాచారం కోసం అర్జీ పెట్టుకున్నాడు.దీనికి ఆ సదరు సీనియరు ప్రభుత్వాధికారి నుంచి వచ్చిన సమాధానంతో యావద్భారతం అవాక్కై విస్తుబోయింది. ' భారత స్వాతంత్ర్య సమరానికి సుభాష్ తన వంతు తోడ్పాటు అందించాడనటానికి మా దగ్గిర ఏటువంటి రికార్డూ లేదు ' అని వివరణ ఇచ్చింది. ఈయన ఫార్మోసా వెళుతున్న సమయంలో విమానం కూలిపోవటంతో ఆగష్టు 18, 1945  న మర ణించాడని అంటారు. ఆ ప్రమాదంలో వీరు మరణించి ఉండకపో వచ్చునని మరి కొందరు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com