ఈజిప్ట్ లో ఉగ్రవాదులనుకొని పర్యాటకులని చంపిన వైనం
- September 13, 2015
ఈజిప్టు భద్రతా బలగాలు ఘోర తప్పిదానికి పాల్పడ్డాయి. ఉగ్రవాదులను హతమార్చేందుకు వారిని వెంటాడుతూ ఆ క్రమంలో పన్నెండు మంది పర్యాటకులను అనుకోకుండా కాల్చి చంపారు. ఈ ఘటన సంచలనానికి తెరతీసింది. పోలీసులు, సైనిక దళాలు ఆదివారం సాయంత్రం ఉమ్మడి ఉగ్రవాద నిరోధక చర్యలకు దిగాయి. ఈ క్రమంలో ఏడారిలో నిషేధిత ప్రాంతమైనా అల వాహత్ లో నాలుగు వాహనాల్లో మెక్సికన్ టూరిస్టులు అనుకోకుండా వచ్చారు. దీంతో అప్పటి వరకు ఉగ్రవాదులను వెంటాడిన భద్రతా బలగాలు ఆ తర్వాత కూడా వారు ఉగ్రవాదులే అనుకుని భ్రమపడి మెక్సికో పర్యాటకుల వాహనాలపై కాల్పులు జరిపారు. దీంతో 12 మంది మెక్సికో టూరిస్టులు ప్రాణాలు కోల్పోగా మరో పది మంది మెక్సికో, ఈజిప్టు టూరిస్టులు గాయాలపాలయ్యారు. ఈజిప్టుకు ప్రధాన ఆదాయం టూరిజం నుంచి వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన కొంత ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అయితే, మెక్సికో మాత్రం ఈ అంశాన్నిఇంకా ధృవీకరించలేదు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









