నేడు 7/11 ముంబై నిందితులకు శిక్ష ఖరారు!
- September 14, 2015
2006లో ముంబయి సబర్బన్ రైలులో సంభవించిన పేలుళ్ల ఘటనకు సంబంధించి న్యాయస్థానం ఈరోజు తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో 12మందిని ముంబయి న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో మొత్తం 13 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొనగా అబ్దుల్ వహీద్ షేక్ అనే వ్యక్తిని కోర్టు నిర్దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. నిందితులకు ఉరిశిక్ష, జీవితఖైదు విధించే అవకాశం ఉంది.2006 జులై 11న 11 నిమిషాల వ్యవధిలో 7సార్లు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 189 మంది మృతిచెందగా... 800 మందికి పైగా గాయపడ్డారు. ఈ భయంకర ఘటన దేశాన్ని కుదిపేసింది. ప్రెసర్ కుక్కర్‌లో ఆర్‌డీఎక్స్ బాంబులను అమర్చి.. ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ కేసును తొమ్మిదేళ్ల పాటు విచారించిన ముంబయిలోని ప్రత్యేక మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్‌డ్ క్రైమ్ యాక్ట్ కోర్టు ఎట్టకేలకు దోషులను నిర్ధారించింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ 192 మందిని విచారించింది. వీరిలో ఐఏఎస్, ఐపీఎస్, రక్షణ శాఖ, న్యాయ శాఖ, వైద్యాధికారులు కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







