ఉద్యోగాల కోసం మిడిల్ ఈస్ట్‌లో 98 శాతం మంది ప్రొఫెషనల్స్ ఎదురుచూపులు
- January 23, 2017
దుబాయ్: కొత్త సంవత్సరం ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఎలోసియా హెచ్‌ఆర్ మేనేజర్, ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తమ సంస్థ బడ్జెటరీ కట్స్‌ని అమలు చేయబోతోందని, తద్వారా నెలవారీ వేతనాల్లో కొంత తగ్గుదల ఉంటుందని ఆమె వెల్లడించారు. మిడిల్ ఈస్ట్ రీజియన్‌లో 98 శాతానికి పైగా ప్రొఫెషనల్స్ ఇప్పుడు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. బేయట్ డాట్‌కామ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెలుగు చూశాయి. అయితే ఉద్యోగార్థులు, సానుకూల దృక్పథంతో ఉండడం అభినందించదగ్గది. ఇంకో వైపున 55.6 శాతం మంది ఉత్సాహంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుండగా, మిగతావారిలో కాస్త నైరాశ్యం కన్పిస్తోంది. జాబ్ సైట్స్ ద్వారా ఉద్యోగావకాశాలు ఆశించిన స్థాయిలో లభించడంలేదని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. ఇంకొందరు మాత్రం జాబ్ పోర్టల్స్ ద్వారా ఉద్యోగావకాశాలు తేలిగ్గానే లభిస్తున్నాయని అంటున్నారు. తగిన అనుభవంతోపాటుగా, ఉద్యోగాన్వేషణలో చలాకీగా వ్యవహరించడం వంటి వాటిని బట్టి ఉద్యోగాలు లభించడం అనేది ఆధారపడి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







