పిల్లలు పట్ల శ్రద్ధ వహించాలని తల్లిదండ్రులకు పోలీసుల సూచన

- January 23, 2017 , by Maagulf
పిల్లలు పట్ల శ్రద్ధ వహించాలని తల్లిదండ్రులకు పోలీసుల సూచన

మస్కట్:మస్కట్ ఉత్సవం ఒకవైపు ఉత్సాహంగా కొనసాగుతుండగా, వేదికల వద్ద... రద్దీగా ఉన్న ప్రాంతాలలో హాజరు అయ్యేటప్పుడు వారి పిల్లల పై ఒక కన్ను వేసి ఉంచాలని తల్లిదండ్రులు మరియు సంరక్షకులను  వేదికల వద్ద రాయల్ ఒమాన్ పోలీసులు కోరారు. మస్కట్ ఫెస్టివల్ నిర్వాహకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, తప్పిపోయిన పిల్లల గూర్చి పలు పిర్యాదులు వస్తున్నాయని, పిల్లలను  సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు వారిని విడిచి ఉండరాదని సూచించారు. మస్కట్ ఫెస్టివల్ ప్రాంతాల్లో రాయల్ ఒమాన్ పోలీసులు బలమైన ఉనికి ఉందని. తమ అధికారులు సైతం తప్పిపోయిన పిల్లల కోసం ఫెస్టివల్ గ్రౌండ్స్ లో ఒక నియమించబడిన ప్రాంతంను కేటాయించారు. ఆచూకీ లేని తమ పిల్లల కోసం ఎదురుచూస్తున్న తల్లితండ్రులను ఇక్కడకు తీసుకువచ్చి వారికి ఆయా పిల్లలను అప్పగించనున్నట్లు వివరించారు. కనబడకుండా పోయిన పిల్లల వివరాలను తెలియచేస్తూ, లేదా ఈ ప్రాంతానికి వచ్చేందుకు వీలుగా  తల్లిదండ్రులు మార్గనిర్దేశం చేస్తూ ప్రకటన చేస్తామని తెలిపారు. మస్కట్ మున్సిపాలిటీ సందేశాన్ని అంతటా వినడానికి అనుకూలంగా ప్రజా సమాచార వ్యవస్థను ఉపయోగిస్తుంది, రాయల్ ఒమాన్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com