వచ్చే సంవత్సర ఆరంభంలో మస్కట్ లో కొత్త విమానాశ్రయం
- September 14, 2015
ఒమాన్ లోని మస్కట్ లో కొత్త ఏర్ పోర్టు పనులు సజావుగా సాగుతున్నాయి. కువైట్-మస్కట్ ల మధ్య నడపబడే నాన్-స్టాప్ విమాన సేవల ఆవిష్కరణ సందర్భంగా, డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవిఏషన్ రెగ్యులేషన్స్ కార్యాలయ సేనియర్ అధికారి ఆన్‌వార్ బిన్ అబ్దుల్లా అల్ రైసి మాట్లాడుతూ, కొత్త విమానాశ్రయం యొక్క రన్ వే మరియు అన్ని నిర్వహణా సదుపాయాలు సిద్ధంగా ఉ న్నాయని, కేవలం టెర్మినల్ బిల్డింగ్ మాత్రమే తెరువవలసి ఉందని తెలియజేశారు. సలాలా అంతర్జాతీయ విమానాశ్రయ పనులు ముగిసాయని, ఇక తాము గడువు సమీపిస్తున్నందున 24 గంటలు మస్కట్ విమానాశ్రయం పనులపై దృష్టి సారిస్తున్నామని, ఒకేసారి 5 విమానాశ్రయాలను నిర్మించడం పెద్ద సవాలు అని చెపుతూ, అక్రమ వలస కార్మికులు మస్కట్ ఏర్‌పోర్ట్ లో పనిచేస్తూ దొరికిపోవడం వలన , అనులు కాస్త ఆలస్యమయ్యాయని అంగీకరించారు. తాము మరిన్ని విమానాలు ఇండియాకు నడపడానికి సిద్ధంగా ఉన్నామని, అందుకు తగిన విధం గా ద్వైపాక్షిక, సీట్ షేరింగ్ ఒప్పందాలను సవరించడానికై విజ్ఞప్తి చేశామని తెలియజేశారు. ఇండియాకు సీట్లను 9,000 నుండి 10,000 కు పెంచడానికి కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







