బహ్రైన్ లో బాంబు భయం - నిలిచిపోయిన ట్రాఫిక్
- September 14, 2015
వివిధ ప్రాంతాలలో అనుమానాస్పద వస్తువులు కనిపించిన నేపధ్యంలో బహ్రైన్ అంతటా ట్రాఫిక్ నిలిచిపోయింది. నిన్న ఉదయం 6 30 గంటలకు షేక్ ఈ సా బిన్ సల్మాన్ హైవే వెంబడి సలమాబాద్ ఇంటర్శెక్షన్ వద్ద అనుమానాస్పద వస్తువు కనబడడంతో మొదలైన ఈ ప్రహసనం, జనాబియా, హిద్ద్ వంటి ప్రాంతాలలో కూడా ఇదే విధంగా జరగడంతో ఇంచుమించు 3 గంటలపాటు నిలిచిపోయిన ట్రాఫిక్ వలన వాహనాలు బారులు తీరాయి. మనామా నుండి సిట్రా మరియు మీన సల్మాన్ కు, ఉమ్మ్ అల్ హస్సన్ ఎవెన్యు నుండి సలమాబాద్ ఇంటర్శెక్షన్ కు వెళ్లే దారులు పోలీసులచే నిరోధించబడ్డాయి. బుదైయ హైవే, జనాబియా మరియు అల్ క్వెర్రీ గ్రామాలను కూడా మూసివేశారు. ఈ నేపధ్యంలో అనేక మంది పిల్లలు, ఉద్యోగస్తులు, ఇతర పనుల మీద వెళ్ళేవరికి తీవ్ర ఇబ్బంది ఎదురవగా, కొన్ని పాఠశాలలు మాత్రం 10 గంటల నుండి తరగతులు ప్రారంభి స్తామని ప్రకటించడం కొంత ఓదార్పు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







