26న వైజాగ్ ఆర్కే బీచ్‌కు వెళుతున్న మొదటి హీరో ఇతనే!
- January 24, 2017
ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ యువత ఈ నెల 26న తలపెట్టిన ఆందోళనా కార్యక్రమానికి సినీ రంగం నుంచి మద్ధతు పెరుగుతోంది. పవన్ కల్యాణ్ స్పందించడం మూలానో, లేదా స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారో కానీ చాలామంది ఈ నిరసన కార్యక్రమానికి మద్ధతుగా సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. హీరో సంపూర్ణేష్ బాబు తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి, అయినప్పటికీ ఏపీ యూత్ చేపట్టిన నిరసన కార్యమానికి మద్ధతుగా ట్వీట్స్ పెడుతుండటం విశేషం. అయితే ఏపీ యూత్ మాత్రం కేవలం ట్వీట్స్ పెడితే సరిపోదని, తమిళ హీరోల్లాగా తెలుగు హీరోలంతా రాష్ట్ర ప్రయోజనాల కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని సరికొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు.
ఈ డిమాండ్‌పై సంపూర్ణేష్ బాబు స్పందించాడు. వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌లో ఈ నెల 26న జరగబోయే హోదా సాధన పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నట్లు ట్వీట్ చేశాడు. వైజాగ్‌కు టికెట్ కూడా కన్ఫార్మ్ అయినట్లు సంపూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. 26న ఆర్కే బీచ్‌లో కలుద్దామన్నాడు.
ప్రత్యేక హోదాపై పవన్ నినాదాన్ని సంపూ మరోసారి ట్వీట్ చేశాడు. తాను ఏ రాజకీయ పార్టీకి మద్ధతు తెలపడం లేదని, యువత చేస్తున్న పోరాటానికే తాను సపోర్ట్ చేస్తున్నానని సంపూర్ణేష్ బాబు తెలిపాడు. అయితే ఈ కార్యక్రమానికి మద్ధతు పలికిన జనసేన అధినేత పవన్ ప్రత్యక్షంగా పాల్గొంటారా లేదా అన్న విషయంపై స్పష్టత రాలేదు. దీంతో ఈ ఆందోళనకు మద్ధతుగా తెలుగు సినీ పరిశ్రమ నుంచి వెళుతున్న వారిలో సంపూనే మొదటివాడు కావడం విశేషం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







