భాగ్యనగరంకు రోడ్డుపై నడిచే ట్రామ్ రైలు రాబోతోంది
- January 24, 2017
రోడ్డుపై నడిచే ట్రామ్ రైలును సైతం హైదరాబాదులో ప్రవేశపెట్టేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైంది. మొదటి దశలో మొజంజాహీ మార్కెట్ నుంచి చార్మినార్ వరకు పనులు ప్రారంభమవుతాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు కోల్‌కతా, ముంబై వంటి నగరాల్లో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న ట్రామ్ రైలు హైదరాబాదుకు వస్తోందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమీషనర్ జనార్ధన్‌రెడ్డి సోమవారం బంజారాహిల్స్ ఆస్కీలో జరిగిన ఇండో ప్రెంచ్ సదస్సులో పేర్కొన్నారు. రెండు రోజుల పాటు ఇంజనీరింగ్ నిపుణులు ప్రతిపాదిత మార్గాల్లో పర్యటించి ప్రాజెక్టు వివరాలు పూర్తిస్థాయిలో సిద్దం చేస్తారని స్పష్టం చేశారు. మొదటి దశలో ప్రాజెక్టు ప్రణాళిక ప్రకారం చార్మినార్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు, అలాగే అబిడ్స్ నుంచి సచివాలయం, రవీంద్రభారతి, సెక్రటేరియట్, హిమాయత్ నగర్, నారాయణగూడ మీదుగా మార్గం నిర్మించి తిలక్ రోడ్డు ద్వారా తిరిగి అబిడ్స్‌లో కలపాలని ప్రాథమిక ప్రణాళిక రూపొందించారు. చార్మినార్ నుంచి గొల్కొండ వరకు కూడా మార్గం నిర్మించే యోచనలో ఉన్నారు.
తాజా వార్తలు
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!









