యూఏఈలో ఖైదీల విడుదలకు 6.71 కోట్లు సాయం ...
- January 24, 2017
యూఏఈలో ఖైదీల విడుదలకు 6.71 కోట్లు సాయం
దుబాయ్: యూఏఈ జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను విడిపించేందుకు 6.71 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు దుబాయ్లోని భారత సంతతికి చెందిన వ్యాపారి ఫిరోజ్ మర్చంట్ ప్రకటించారు. ఇందులో భాగంగా తొలుత అజ్మాన్ సెంట్రల్ జైలు నుంచి 132 మంది ఖైదీల విడుదలకు రూ.2.78 కోట్లు చెల్లించారు. రుణాలు చెల్లించలేని వారు, తమ శిక్షా కాలం ముగిసినా స్వదేశం తిరిగి వెళ్లేందుకు డబ్బులు లేక అక్కడే ఉంటున్న వారికి సాయం చేసేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు.
విమాన ప్రయాణ టికెట్లతోపాటు, జైళ్ల నుంచి విడుదలైన వారు క్షేమంగా ఇంటికెళ్లేలా వాళ్ల స్థానిక కరెన్సీకి సమానమైన మొత్తాన్ని కూడా మర్చంట్ కార్యాలయం ఇస్తుంది.
' పరిస్థితుల వల్లే వారంతా బాధితులయ్యారు. నిజమైన నేరగాళ్లు కాదు. రుణ సంబంధ కారణాలతోనే చాలా మంది జైలు జీవితం గడుపుతున్నారు. అందుకే వారిని సొంతగడ్డకు పంపడానికి నాకు చేతనైనంత సాయం చేయాలని నిర్ణయించుకున్నా' అని మర్చంట్ అన్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







