ట్రంప్ భారత్‌కు రా ..మోదీ అమెరికాకు రా...
- January 24, 2017
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ మధ్య తొలి ఫోన్ సంభాషణ సుహృద్భావ వాతావరణంలో సాగింది. మోదీకి ఫోన్ చేసిన ట్రంప్.. భారత్‌ను నిజమైన స్నేహితుడిగా, భాగస్వామిగా అభివర్ణించారు. 'ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాళ్లు ఎదుర్కోవడంలో భారత్ నిజమైన స్నేహితుడు, భాగస్వామి' అంటూ మోదీతో ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా-భారత్ భాగస్వామ్యాన్ని మరింత విస్తృతపరచడం, ఆర్థిక, రక్షణ రంగాల్లో బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై ఇరువురు నేతలు చర్చించారు. అంతేకాదు దక్షిణాసియా, మధ్య ఆసియా ప్రాంతాల్లో భద్రతపైనా చర్చించారు. గత శుక్రవారం అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత ట్రంప్ తొలిసారి మంగళవారం రాత్రి ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు.
అంతేకాకుండా ఈ ఏడాది చివర్లో అమెరికాకు రావాల్సిందిగా మోదీని ట్రంప్ ఆహ్వానించారు.
అధ్యక్షుడు ట్రంప్‌తో సుహృద్భావరీతిలో సంభాషించానని ప్రధాని మోదీ కూడా ట్విట్టర్లో తెలిపారు. రానున్న రోజుల్లో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకునేందుకు కలిసి సన్నిహితంగా పనిచేయాల్సిన అవసరంపై తాను, ట్రంప్ ఏకీభవించామని ఆయన పేర్కొన్నారు. భారత్‌ను సందర్శించాల్సిందిగా ట్రంప్‌ను ఆహ్వానించినట్టు ప్రధాని మోదీ వెల్లడించారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







