బహ్రైన్ లో 400 బిలియన్ డాలర్లతో విస్తరించనున్న చమురు మరియు సహజ వాయు పరిశ్రమ
- September 14, 2015
బహ్రైన్ లోని ప్రాంతీయ చమురు మరియు సహజ వాయు పరిశ్రమను 400 బిలియన్ డాలర్లతో విస్తరించనున్నట్టు బహ్రైన్ శక్తి వనరుల శాఖ మంత్రి మరియు నేషనల్ ఆయిల్ అండ్ గ్యాస్ ఆధరిటీ ఛైర్మన్ డా. అబ్దుల్ హుస్సైన్ మీర్జా , గల్ఫ్ హోటెల్ లోని గల్ఫ్ ఇంటర్నేషనల్ కాన్వెన్షన్సెంటర్ లో జరిగిన ఏడవ మధ్య ప్రాచ్య నాన్- డిస్ట్రాక్టివ్ టెస్టింగ్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ లో తెలిపారు. భద్రత మరియు సరైన నిర్వహణల కోసం, ఈ విస్తరణ అత్యంత అవసరమని ఆయన అన్నారు. అధిక ఉష్ణోగ్రతా శ్రేణి, అధిక తేమ, చమురు మరియు సహజవాయు ఉత్పత్తులలో అధిక సల్ఫర్ శాతం వంటి కారణాల వలన, మధ్య ప్రాచ్యం, అందునా ప్రత్యేకించి గల్ఫ్ దేశాలు అమిత క్షయ సంబంధ సమస్యలకు గురౌతున్నాయి. శక్తి వనరుల ఉత్పత్తికి, సర్వ కాలాల్లో ఆధారపడగల అత్యధిక స్థాయి గల యంత్ర సామగ్రి అవసరమని, భద్రత మరియు నమ్మకమైన పనుల నిర్వహణ కోసం పాతబడిన మౌలిక నిర్మాణాలను తరచూ పర్యవేక్షించడం అవసరమైనీ, అందుకై మన కర్మాగారాలు, పైప్ లైన్లు సక్రమంగా నడవడానికి చిన్న చిన్న విషయాలపై కూడా సునిశిత పరిశీలన అవసరమని డా. మీర్జా చెప్పారు. చమురు మరియు సహజ వాయు రంగాల్లో ఎదురయే వినూత్న సమస్యలను ఎదుర్కోవడానికి ఉద్దేశించి, బహ్రైన్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ మరియు సౌదీ అరబియన్ సెక్షన్ ఆఫ్ ద అమెరికన్ సొసైటీ ఫర్ నాన్-డిస్ట్రక్టివ్ టెస్టింగ్ వారు ఏర్పాటుచేసిన ఈ 4-రోజుల కార్యక్రమానికి వందలాది నిపుణులు హాజరు కానున్నారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







