త్వరలో దుబాయ్ లో అందుబాటులోకి రానున్న మరింత తాజా కూరగాయలు, పళ్ళు
- September 14, 2015
దుబాయ్, అల్ అవీర్ లోని సెంట్రల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ మార్కెట్లో ఉత్తమ సేవలను అందించడం కోసం మరిన్ని ఏర్పాట్లు జరుగుతున్నందున, ప్రజలు మరింత తాజా కూరగాయలు, పళ్ళను పొందగలుగుతారు! 2004 సంవత్సరంలో 1 చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో ఏర్పాటుచేయబడిన ఈ మార్కెట్, 2012 వరకు ఎమిరేట్స్ ప్రజలకు సరిపడా కూరగాయలు, పండ్లను సరఫరా చేసింది. దుబాయి మునిసిపాలిటీ వారిచే నిర్వహించబడే ఈ మార్కెట్లో రోజూ స్థానిక పొలాలు, రేవులనుండి వచ్చే కూరగాయలు,పళ్లను కలిగిఉన్న 600 ట్రక్కులు, ఒకొక్కటి 22 నుండి 26 టన్నుల సరుకుతో ఇక్కడకు వస్తాయి. ఐతే 2012నుండి విని యోగదారులు, వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతున్నందున, దీనిపై మరింత భారం పడింది; అందుకే, ప్రస్తుత అవసరాల కోసం, 1.3 బిలియన్ దిర్హమ్ల విలువగల, 56 స్టోర్ లు గల 3 అంతస్టుల కొత్త కోల్డ్ స్టోరేజ్ యూనిట్ రానున్న మార్చ్ నుండి ప్రారంభించ నున్నట్టు, ఈ మార్కెట్ హెడ్ ఫైజల్ అబ్దుల్లా మొహమద్ తెలిపారు.దీనివల్ల 150 శాతం ఎక్కువ నిల్వ ప్రదేశం లభిస్తుంది.
ఇక దుబాయ్ వల్డ్ ట్రేడ్ సెంటర్లో జరగనున్న, GCC లో ఏకైక తాజా ఆహార పదార్ధాల ఎగ్జిబిషన్ ఐన 7వ ‘ఇంటర్నేషనల్ పెరిష్య బుల్స్ ఎక్స్పో- మిడిల్ ఈస్ట్’ లో ఈ సంవత్సరం పాల్గొనాలనే మునిసిపాలిటీ వారి వ్యూహాత్మక నిర్ణయానికి అనుగుణంగా, ఆశి స్టెంట్ డైరక్టర్ జనరల్ ఫర్ జనరల్ సపోర్ట్ - ఒబైడ్ సాలెం అల్ శాంసీ, ప్లానెట్ఫైర్ వారి ప్రోజెక్ట్ డైరక్టర్- తారేక్ సిబాయితో అవగాహనా పత్రంపై సంతకాలు చేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







