దుబాయ్ లో బుర్జ్ ఖలిఫా టవర్‌పై 'త్రివర్ణ' కాంతులు
- January 25, 2017
భారత్ 68వ రిపబ్లిక్‌డే వేడుకలు దుబాయ్‌లోనూ అంబరాన్నంటనున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దుబాయ్ 'బుర్జ్ ఖలిఫా' బిల్డింగ్ త్రివర్ణ పతాక శోభలీననుంది. త్రివర్ణ పతాక రంగులతో కూడిన ఎల్ఈడీ బల్బులు అర్ధరాత్రి నుంచే జగజ్జేయమానంగా తళుకులీననున్నాయి. బుర్జ్ ఖలీఫ్ ఈ విషయాన్ని ట్విట్టర్లో ప్రకటించింది. ఆంగ్ల, అరబిక్ భాషల్లో ఈ ట్వీట్ చేసింది. బుర్జ్ ఖలిఫా బిల్డింగ్ ఎత్తు 823 మీటర్లు. అబుధాబి పాలకుడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ ఖలిఫా బిన్ జాయెద్ అల్ నహాయన్ గౌరవార్ధం ఈ బిల్డింగ్‌కు బుర్జ్ ఖలిఫా పేరు పెట్టారు. కాగా, గురువారం జరుగనున్న భారతదేశ గణతంత్ర వేడుకల్లో అబుధాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహాయన్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







