తమిళ సంవత్సరాదికి 2.0 టీజర్...

- January 27, 2017 , by Maagulf
తమిళ సంవత్సరాదికి 2.0 టీజర్...

గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 2.0. గతంలో ఇదే కాంబినేషన్ లో తెరకెక్కిన రోబోకు సీక్వల్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై బాలీవుడ్ లో కూడా భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లకు మంచి రెస్పాన్స్ రావటంతో అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేసింది రోబో టీం. తమిళ సంవత్సారాది సందర్భంగా ఏప్రిల్ 14న 2.0 టీజర్ ను రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com